యువత కబుర్లు కాస్త సీరియస్‌ విషయాలుగా మారితే...!

If The Chatting Of The Youth Turns Into Something Serious - Sakshi

కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్‌ గురించి విన్నావా? ఇన్‌స్టాగ్రామ్‌లో నా లేటెస్ట్‌ ఇమేజ్‌లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్‌ టాక్‌’ కంటే.. ‘బిగ్‌ టాక్‌’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్‌ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్‌ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్‌ టాక్‌’ ట్రెండ్‌ అంటున్నారు.

‘బిగ్‌ టాక్‌’ అనేది ‘టాప్‌ ట్రెండ్స్‌ ఫర్‌ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్‌ టాక్‌’కు అపోజిట్‌ ట్రెండ్‌. ‘స్మాల్‌ టాక్‌’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్‌ టాక్‌ ట్రెండ్‌ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్‌లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్‌ టాపిక్స్‌పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్‌కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్‌ ఒకే అన్నారు. అయితే బిగ్‌ టాక్‌ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్‌తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్‌ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్‌పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి.

ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్‌ టాక్‌’లో భాగంగా ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు.
‘నా కొలీగ్‌ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్‌ టాక్‌లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్‌ కాఫీ కార్నర్‌లో బిగ్‌ టాక్‌ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్‌పూర్‌కు చెందిన నిఖిల్‌ మిత్ర.

బిగ్‌ టాక్‌లో భాగంగా..
జాబ్‌ మార్కెట్‌పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌–టైమ్‌ జాబ్స్‌పై ‘చాట్‌జీపీటి’లాంటి జెనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌ చూపించే ప్రభావం, మోస్ట్‌ హైలీ క్వాలిఫైడ్‌ వర్కర్స్‌ ఎలాంటి అడ్జెస్ట్‌మెంట్స్‌కు ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది, సీనియర్‌లతో పోల్చితే జెన్‌ జెడ్‌ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్‌ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్‌లపై కొలీగ్‌తో మాట్లాడాడు నిఖిల్‌ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ‘బిగ్‌ టాక్‌’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్‌గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్‌ టాక్‌’ ట్రెండ్‌ సారాశం.

పారదర్శక సంభాషణ
స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు కొలీగ్స్‌తో ఉండే స్నేహం ఆఫీస్‌ టైమింగ్స్‌ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్‌ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్‌–సెన్సర్‌ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది.
ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్‌ ప్రొఫెషనల్స్‌లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్‌ సర్వే ప్రకారం సెన్సిటివ్‌ టాపిక్స్‌ గురించి కొలీగ్స్‌తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు.

ఇవి చదవండి: పర్పుల్‌ కలర్‌ ఎందుకు?

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top