How To Make Milk Daal Halwa Recipe - Sakshi
Sakshi News home page

Milk Daal Halwa: ఈజీ అండ్‌ ఫాస్ట్‌గా మిల్క్‌ దాల్‌ హల్వా

Jul 25 2023 2:46 PM | Updated on Jul 27 2023 4:35 PM

How To Make Milk Daal Halwa Recipe - Sakshi

మిల్క్‌ దాల్‌ హల్వా తయారీకి కావల్సినవి
చిక్కటి పాలు, పుట్నాల పప్పు – 2 కప్పులు చొప్పున
పంచదార – 2 కప్పులు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు)
జీడిపప్పులు –10, నెయ్యి – 5 లేదా 6 టేబుల్‌ స్పూన్లు
ఏలకులు – 2 (అభిరుచిని బట్టి)

తయారీ విధానమిలా..
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాత్రలో పాలు వేడి చేసుకుని అందులో పుట్నాల పప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ, చిన్న మంట మీద, పాలను ఒక పొంగు రానివ్వాలి. వెంటనే మరోసారి కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. పాలు చల్లారాక ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు, పంచదార, ఏలకులు వేసుకుని మరోసారి మెత్తగా చేసుకోవాలి.

మిక్సీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసుకోవచ్చు. మరోసారి స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ముందు వాడిన పాత్రను ఒకసారి క్లీన్‌ చేసుకుని స్టవ్‌ మీద పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని.. వేడి కాగానే పాలు, పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకూ తిప్పుతూ ఉండాలి.

దగ్గర పడగానే.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. చివరిగా మిలిగిన కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి. అనంతరం నచ్చిన పాత్రకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసి చదును చెయ్యాలి. కాసేపటికి ముక్కలు కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement