Sravana Masam Prasadam Recipes: How To Make Khajoor Gajar Halwa Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Sravana Masam Prasadam Recipes: శ్రావణమాసం స్పెషల్‌.. టేస్టీ హల్వా చేసుకోండి ఇలా

Aug 21 2023 10:37 AM | Updated on Aug 21 2023 11:04 AM

How To Make Khajoor Gajar Halwa Recipe In Telugu - Sakshi

క్యారెట్‌–ఖర్జూరం హల్వా తయారీకి కావల్సినవి:

ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)
క్యారెట్‌ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు
కొబ్బరి కోరు, కస్టర్డ్‌ మిల్క్‌– పావు కప్పు చొప్పున, నెయ్యి,
పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్‌– 1 టీ స్పూన్‌
కిస్మిస్‌ గుజ్జు– 1 టేబుల్‌ స్పూన్, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఫుడ్‌ కలర్‌– క్యారెట్‌ కలర్‌ (అభిరుచిని బట్టి)



తయారీ విధానమిలా..
ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
► అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌ బౌల్‌లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.


► కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్‌ తురుము, కస్టర్డ్‌ మిల్క్, ఫుడ్‌ కలర్‌ వేసుకుని తిప్పుతూ ఉండాలి.
► ఆ తర్వాత కిస్మిస్‌ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్‌ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.
► ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్‌ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్‌ చేసుకోవాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement