హిమాచల్‌ తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌

Himachal First Women Ambulance Driver Is Nancy Katnoria - Sakshi

‘అంబులెన్స్‌ డ్రైవర్‌ కావాలనేది నా కల’ అని ఎవరైనా అంటే ఆశ్చర్యంగా చూస్తారు. నాన్సీ కట్నారియా (22) విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టకేలకు నాన్సీ తన కలను నెరవేర్చుకుంది. ఒకప్పుడు ఆమె పేరు పక్కన ఎలాంటి విశేషణాలు లేవు. ఇప్పుడు రెండు చేరాయి. అవి: హిమాచల్‌ప్రదేశ్‌ తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్, మనదేశంలో రెండో మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌.
ఒకరికి ఒక వృత్తి మీద ఎందుకు ఇష్టం ఏర్పడుతుందంటే బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. నాన్సీ అంబులెన్స్‌ డ్రైవర్‌ కావాలనుకోవడానికి ఒక కారణం ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం...
దగ్గరి బంధువు ఒకరికి తన కళ్లముందే యాక్సిడెంట్‌ అయింది. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. దేవుడు పంపిన వాహనంలా మెరుపువేగంతో దూసుకువచ్చి బాధితుడిని హాస్పిటల్‌లో చేర్పించింది అంబులెన్స్‌. ‘గోల్డెన్‌ టైమ్‌లో తీసుకువచ్చారు. ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు దక్కేవి కావు’ అన్నారు వైద్యులు. తన బంధువు బతికి ఉన్నాడంటే కారణం... అంబులెన్స్‌. అప్పటి నుంచి ఆమెలో అంబులెన్స్‌ అంటే ఒక ఆరాధన లాంటిది ఏర్పడింది.

హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌టీసి) స్కూల్‌లో డ్రైవింగ్‌ పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్న నాన్సీ నర్పూర్‌ సివిల్‌ హాస్పిటల్‌ 102 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీస్‌ డ్రైవర్‌గా విధుల్లో చేరింది.
 ‘నేను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే కాదు సేవ కూడా’ అంటోంది నాన్సీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top