కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, మీకూ వస్తాయా? | Heart Attack At A Young Age: Here How To Avoid - Sakshi
Sakshi News home page

Heart Attacks In Younger Age: చిన్న వయసులోనే గుండెజబ్బులు.. కారణాలు ఏంటి?

Published Mon, Oct 9 2023 1:05 PM

Heart Attacks In Younger Age: How to avoid - Sakshi

ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసులోనే పలువురు గుండె జబ్బులకు గురవుతున్నారు. యువతలో గుండెజబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

  • ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌ వంటివి గుండెజబ్బుల రిస్క్‌ను పెంచుతుంది. 
  • అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. 
  • అధిక బరువుతో పాటు ఎప్పుడూ కూర్చొనే ఉండటం గుండెజబ్బుకి మరో కారణం.
  • అధిక ఒత్తిడి కూడా గుండెజబ్బులను పెంచుతుంది. 
  • ఒత్తిడి, ఊబకాయం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అయిల్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ గుండెజబ్బులకు ప్రధాన కారణాలు. 

ఏం చేస్తే మంచిది?
గుండె బలహీనంగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. 
♦ సొరకాయ జ్యూస్.. దీన్నే లౌకికా జ్యూస్‌ అని కూడా అంటారు. నెలకు ఒకసారి ఇది తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
♦ గుమ్మడి కాయ, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిడ్నీ బీన్స్, ఆపిల్ వంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. 
♦ వెల్లుల్లి.. రక్తాన్ని పలుచన చేస్తుంది. దీనివల్ల శరీరీ భాగాలన్నింటికి రక్తం సరఫరా ఈజీగా అవుతుంది. 

గుండెజబ్బులు.. వంశపారం పర్యంగా వస్తుందా?

► నిత్యం వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చా అన్నది కశ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మన ముందు తరాల్లో అమ్మమ్మకో, నాయినమ్మకో గుండెజబ్బు హిస్టరీ ఉంటే అప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. 
► సమతులమైన ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియకీ, మన జీన్స్ ని మోటివేట్ చెయ్యడానికీ లివర్ పాంక్రీస్ పనిచేస్తాయి.
► చిన్నప్పటి నుంచి మాంసాహారం తీసుకునే వాళ్లకి మొదటి తరంలోనే బానే ఉంటుంది. కానీ రెండో తరం వాళ్లలో శరీరం మీద గడ్డలూ, కొన్నిచోట్లు దద్దుర్లు రావడం కనిపిస్తుంది. కానీ చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. 
► ఇక మూడో తరం వచ్చేసరికి ఎవరికైనా గుండెజబ్బు ఉంటే తప్పకుండా మనవడికి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే హార్ట్‌ రిస్క్‌ మూలాలు మూడు తరాల వరకు ఉంటాయి. 
► స్ట్రేట్చింగ్  శరీరానికి చాలా మంచిది. ప్రతిరోజూ కనీసం 40 నిమిషాలు అయినా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. 

-నవీన్‌ నడిమింటి
ఫోన్ -9703706660
ప్రముఖ ఆయుర్వేద నిపుణులు


 

 
Advertisement
 
Advertisement