క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? | Have You Ever Wonderedd What A QR Code Is | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?

Jun 8 2026 7:38 AM | Updated on Jun 8 2026 7:38 AM

Have You Ever Wonderedd What A QR Code Is

క్యూఆర్‌ కోడ్‌

పిల్లలూ! నేడు చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్‌ వరకు ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి అయిపోయింది. అసలు ఆ క్యూఆర్‌ కోడ్‌ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది చదివేయండి. 

క్యూఆర్‌ అంటే క్విక్‌ రెస్పాన్స్‌. అంటే త్వరగా స్పందించడం అని అర్థం. మనం ఏ క్యూఆర్‌ కోడ్‌ను గమనించినా, దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి బాక్సులు కనిపిస్తాయి. ఇవి డిజైన్‌ కోసం పెట్టినవి కావు. మనం మొబైల్‌ ఫోన్‌ ను ఏ యాంగిల్‌లో పెట్టి స్కాన్‌ చేసినా, కెమెరా ఆ కోడ్‌ను వెంటనే గుర్తించడానికి ఈ మూడు బాక్సులు ఎంతగానో సహాయపడతాయి.

అలాగే క్యూఆర్‌ కోడ్‌ మధ్యలో వేల కొద్దీ చిన్న చిన్న నల్లటి, తెల్లటి చుక్కలు ఉంటాయి. ఆ కోడ్‌ను స్కాన్‌ చేసినప్పుడు, ఆ నలుపు–తెలుపు చుక్కలను ‘1’లు ‘0’లుగా మన ఫోన్‌ కెమెరా చదువుతుంది. దానినే బైనరీ డేటా అని పిలుస్తారు. అలా చదివిన సమాచారాన్ని క్షణాల వ్యవధిలో మనకు అవసరమైన డేటాగా లేదా చెల్లింపు లింక్‌గా మార్చేస్తుంది.

ఈ అద్భుతమైన సాంకేతికతను మొదటగా 1994లో జపాన్‌ లోని ఒక ప్రముఖ కంపెనీ కనిపెట్టింది. తమ కార్ల విడిభాగాలను ట్రాక్‌ చేయడం కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ టెక్నాలజీని తీసుకొచ్చింది. అలా వచ్చిన ఈ సాంకేతికతనేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల డిజిటల్‌ ట్రాన్సక్షన్లలో, వ్యాపారాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement