ఈ నెస్ట్‌ ట్యూబ్స్‌తో వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా.. | Sakshi
Sakshi News home page

ఈ నెస్ట్‌ ట్యూబ్స్‌తో వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా..

Published Sun, Mar 3 2024 8:18 AM

Have You Ever Tried This Test Tubes For Decoration - Sakshi

వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా.. ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు ఇంట్లో ప్లేస్‌ని బట్టి కొన్ని ఇండోర్‌ ప్లాంట్స్‌ను ప్లాన్‌ చేసుకుంటాం. అయితే ఆ ప్లాన్‌లో కుండీల కన్నా ఈ నెస్ట్‌ ట్యూబ్స్‌ని ప్లేస్‌ చేసుకోండి. పచ్చదనం.. చల్లదనంతోపాటు వాల్‌ డెకర్‌గా ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తాయి.


ఇంట్లో మొక్కలు ఉంటే దోమలు వస్తాయనుకునేవారు హెర్బల్‌ ప్లాంట్స్‌ని పెంచుకోవచ్చు ఈ నెస్ట్‌ ట్యూబ్స్‌లో. వాటిని ఇదిగో ఇలా వుడెన్‌ స్టాండ్స్‌లో సెట్‌ చేస్తే మీ ఇంటికి కూల్‌ లుక్‌ వచ్చేస్తుంది.

నెస్ట్‌ ట్యూబ్స్‌
నెస్ట్‌ ట్యూబ్స్‌తో ఉన్న రెడీమేడ్‌  వుడెన్‌ వాల్‌ స్టాండ్స్‌.. హ్యాంగింగ్స్‌.. వెరైటీ డిజైన్స్‌తో ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌ మార్కెట్స్‌లో లభ్యమవుతున్నాయి. ఆసక్తి ఉంటే ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. గ్లాస్‌ ట్యూబ్స్, వుడెన్‌ స్టాండ్స్, గ్లూ లేదా స్టికర్స్‌.. ఉంటే చాలు. గ్లాస్‌ ట్యూబ్స్‌ లేకపోతే చిన్న చిన్న వాటర్‌ బాటిల్స్‌ను ఉపయోగించవచ్చు. అయితే, అన్నీ ఒకే సైజ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో ట్రై చేసి చూడండి.. మీ ఇంటి అందం రెట్టింపు అవడం గ్యారంటీ!

ఇవి చదవండి: నీ సంబడం సంతకెళ్లి పోను

Advertisement
 
Advertisement
 
Advertisement