ఫేషియల్‌ మెషిన్‌.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది | Handheld Facial Massager To Help Collagen Level In Skin | Sakshi
Sakshi News home page

Facial Massager: ఫేషియల్‌ మెషిన్‌.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది..

Sep 8 2023 4:51 PM | Updated on Sep 8 2023 6:40 PM

Handheld Facial Massager To Help Collagen Level In Skin - Sakshi

స్కిన్‌ కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో  ట్రీట్మెంట్‌లు.. ఇలా రకరకాల పద్దతులను పాటిస్తుంటారు. అయినా  సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్‌.. ఈ హ్యాండ్‌హెల్డ్‌ ఫేషియల్‌ మసాజర్‌. బెస్ట్‌ స్కిన్‌ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది.ఈ కాంపాక్ట్‌ ఎలక్ట్రిక్‌ ఫేస్‌ అండ్‌ స్కిన్‌  కేర్‌ థెరపీ టూల్‌.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్‌ఈడీ  లైట్‌ థెరపీ హెడ్‌.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది.

చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్‌ బ్యూటీ మెషిన్‌  చక్కగా ఉపయోగపడుతుంది. హాట్‌ అండ్‌ కోల్డ్‌ రింగ్స్‌తో పాటు క్లీనింగ్‌ రింగ్‌నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్‌ చేసుకోవచ్చు.

మైక్రోకరెంట్‌ టెక్నాలజీతో ఈ ఫేషియల్‌ మెషిన్‌..  కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి..  స్కిన్‌ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్‌ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది.ఈ మెషిన్‌ ని భద్రపరచు కోవడానికి సాఫ్ట్‌ కేరింగ్‌ బ్యాగ్‌ లభిస్తుంది.

అలాగే చార్జింగ్‌ పెట్టుకోవడానికి ఒక యూఎస్‌బీ చార్జింగ్‌ కేబుల్‌ ఉంటుంది. ఇలాంటి డివైజెస్‌ను ఆన్‌లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్‌ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement