చిన్నారుల చేత రావణుడు... | 250 childrens made eco-friendly Ravans at Pratapgarh, Uttar Pradesh | Sakshi
Sakshi News home page

చిన్నారుల చేత రావణుడు...

Oct 17 2026 1:23 AM | Updated on Oct 17 2026 1:23 AM

250 childrens made eco-friendly Ravans at Pratapgarh, Uttar Pradesh

చేతన

దసరా అంటే రావణ దహనం. కాని ఉత్తరప్రదేశ్‌లోని పిల్లలకు మాత్రం రంగురంగుల బొమ్మలతో వారి ప్రతిభ చాటే సమయం! ప్రతాప్‌గఢ్‌లో 250 మంది చిన్నారులు తమ చేతులతో రావణుడి ప్రతిమలను తయారు చేసుకుని పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన ఈ పిల్లలకు ఆనందాన్ని పంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. 

మిషన్‌ శక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు మూడు అడుగుల రావణుడి బొమ్మలను తయారు చేసి, వాటికి రంగులు అద్ది అలంకరించారు. రావణ దహనం కోసం విల్లు, బాణాలు వంటి పండుగకు సంబంధించిన వస్తువులనూ రూపొందించారు. తమ చేతులతో బొమ్మలు తయారు చేసుకుంటూ సృజనాత్మకతను చాటుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement