థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుక వేరే లెవల్‌! చూసి తరించాల్సిందే! | Diwali 2024: Amazing Details About Thailand Lantern Festivals | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుక వేరే లెవల్‌! చూసి తరించాల్సిందే!

Oct 28 2024 4:42 PM | Updated on Oct 28 2024 5:24 PM

Diwali 2024: Amazing Details About Thailand Lantern Festivals

వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు  ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో  దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు  కొలిపే దీపకాంతులతో థాయ్‌లాండ్‌ మెరిసి పోతుంది.  నింగిలోనూ,  నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్‌లో దీపావళి వేడుక ఒక రేంజ్‌లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

థాయ్‌లాండ్‌లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు)  ప్రత్యేక ఆకర్షణ.  ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.  ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .

లాయ్ క్రాథోంగ్  (లాంతర్ల పండుగ)
దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు.  loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం.  థాయ్‌లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా  భావిస్తారు.  మంత్రముగ్ధం చేసే ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే,  ఉత్తర థాయిలాండ్‌లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో   ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. 

యి పెంగ్
స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.

దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో  బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా  పాల్గొంటారు.  ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు,  స్పెషల్‌ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది.  వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement