
మ్యూజిక్ వరల్డ్
స్థానిక కళాకారులతో కలిసి పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్‌లో( Youtube) ‘మోస్ట్ వ్యూడ్ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్.
జీమ్యూజిక్‌కు రెడ్ డైమండ్ ప్లే బటన్
మన దేశంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్‌లో ‘జీ మ్యూజిక్ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్‌లో 100 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లతో ‘వావ్’ అనిపించింది. యూట్యూబ్ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్ డైమండ్ ప్లే బటన్’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్ లేబుల్... జీ మ్యూజిక్. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్ వ్యూడ్ వీడియో.
ఇవీ చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!