చాయ్‌ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!

This Is The Dangerous Tea In The World Chinas Huashan Teahouse - Sakshi

ప్రపంచంలో ఎక్కడైనా చాయ్‌ తాగాలంటే జేబులో డబ్బులుంటే సరిపోతుంది. చైనాలోని హువాషాన్‌ టీహౌస్‌లో చాయ్‌ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండెధైర్యం, సాహసం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ చాయ్‌ తాగాలంటే, కొండ ఎక్కాల్సిందే! చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండ దారుల్లో ఒకటిగా పేరుమోసింది.

ఈ కొండ మీద ఉన్న హువాషాన్‌ ఆలయానికి అనుబంధంగా చాయ్‌ హోటల్‌ ఉంది. తావో మతస్థులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్యసాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి, ఇక్కడ వేడి వేడి చాయ్‌ సేవించి, సేదదీరుతుంటారు. సముద్ర మట్టానికి 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలసిన ఈ చాయ్‌ హోటల్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హోటల్‌గా ప్రసిద్ధి పొందింది. 

(చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్‌మఠ్‌ టెంపుల్‌ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top