
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ కోసం మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) సవరణను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకనటలో తెలిపారు
దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భర్తలను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు పింఛను అర్హత ఉండేది.