సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌, ఎవరు తీశారో ఊహించగలరా? | Celebrity Wedding Photographer Vishal Gets Married who Shot His Wedding | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌, ఎవరు తీశారో ఊహించగలరా?

Published Mon, Mar 24 2025 11:49 AM | Last Updated on Mon, Mar 24 2025 2:19 PM

Celebrity Wedding Photographer Vishal Gets Married who Shot His Wedding

సెలబ్రిటీ వెడ్డింగ్‌  ఫోటోగ్రాఫర్‌ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు.  ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా  తీసే ఈ వెడ్డింగ్‌  ఫోటోగ్రాఫర్‌ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.  నిజమే కదా..  ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌. వీరి బిగ్‌ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.

సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్ విశాల్  పంజాబీ ఒక  ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో  వివాహ  బంధంలోకి అడుగు పెట్టాడు.  తద్వారా  ఇటీవల బ్యాచిటర్‌ లైఫ్‌ కి గుడ్‌ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు.  మార్చి 23,ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్‌ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం.  అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్‌ వేడుకలనుంచి  పవిత్ర హోమం  చుట్టూ ప్రదక్షిణలు దాకా,  అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం  మరో విశేషం.

ఇదీ  చదవండి: Tamannaah Bhatia: సమ్మర్‌ స్పెషల్‌ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్

‘‘15 ఏళ్ల తన  కరియర్‌లో చాలా తక్కువ సార్లుమాత్రమే  తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది.   అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్‌  ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ  ఇన్‌స్టాలో ఒక నోట్‌  ద్వారా  కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.

మనీష్ మల్హోత్రా  డిజైన్‌ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు.  హ్యాండ్లూమ్‌ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్  డిఫరెంట్‌ లుక్‌లో  కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు.  ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు ,  క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు.  రష్యన్ పచ్చలు,  అన్‌ కట్‌ డైమండ్‌  జ్యుయల్లరీ,  18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్‌తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.

విశాల్-నిక్కీ లవ్‌ స్టోరీ
విశాల్ పంజాబీ ,  నిక్కీ కృష్ణన్ గత  ఏడాది జూన్ 2024లో  లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్‌.  ఆ సమయంలో  వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి,  మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. 

ఎవరీ జోసెఫ్ రాధిక్
హై ప్రొఫైల్  పెళ్లిళ్లు అనగానే  ప్రముఖ ఫోటోగ్రాఫర్  జోసెఫ్‌ రాధిక్‌ గుర్తొస్తాడు.  బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార  విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్  కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే.  అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్‌ల  డ్రీమీ వెడ్డింగ్‌ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement