Kolkata Rasgulla: ఈ స్వీట్‌ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!

British High Commissioner referring This famous Kolkata sweet - Sakshi

ఢిల్లీకి వెళ్తే చోలే భచూరా రుచి చూడకుండ ఉండలేరు. చెన్నై మురుకులు, హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ తినందే అక్కడి నుంచి కదలరు భోజనప్రియులు. ఇంకా బెనారస్‌ లస్సీ, అమృత్‌సర్‌ జిలేబీ, అహ్మదాబాద్‌ డోక్లా, ముంబాయ్‌ వడాపావ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అలాగే దేశీ వంటకాల్లో కలకత్తా రసగుల్లా కూడా చాలా ఫేమస్‌ అండీ!

ఇటీవల బ్రిటీష్‌ హైకమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ కోల్‌కతా సందర్శించారు. ఇంకేముంది అక్కడి ఫేమస్‌ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచి చూసేశారు. రసగుల్లాకి ఫిదా అయిపోయారు. దీని రుచిని గురించి తెల్పుతూ ట్విటర్‌లో పోస్ట్‌ కూడా పెట్టారు. ‘ఇండియాలోనే స్వీటెస్ట్‌ సిటీ అయిన కలకత్తాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీ దాస్‌ ఔట్‌లెట్‌లోని ఫేమస్‌ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచిచూశాను’ అని బెంగాళీ భాషలో రాశారు. ముఖం మీద చిరునవ్వుతో మట్టిపాత్రలోని రసగుల్లాను తింటున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఈ స్వీట్‌ను రుచి చూడమనని రిఫర్‌ చేశారు కూడా.

ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్లు, అభిమానులు మాత్రం కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది కోల్‌కతాలోని ఇతర ప్రసిద్ధ వంటకాలు, స్వీట్లను కూడా రుచి చూడమని కోరారు. తాజాగా ప్రముఖ పారిశ్రమిక వేత్త హర్ష్‌ గొయెంకా కూడా దేశంలోనే కోల్‌కతా స్ట్రీట్‌ ఫుడ్‌ బెస్ట్‌ అని ట్విటర్‌లో పేర్కొనడం విశేషం.

చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top