Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!

Mystery Of Stonehenge Monuments Which Is Located In England - Sakshi

ఇప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరిపోయింది. ఎంత బరువునైనా, ఎంత పెద్ద వస్తువునైనా  ఒక చోటు నుంచి మరోచోటుకి తేలికగా రవాణా చేయొచ్చు. ఈ రోజుల్లో ఇట్లాంటి ఫీట్లు మామూలే!

కానీ 5 వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనదేకదా! నాగరికత, సైన్స్‌ అంతగా అభివృద్ధి చెందని ఆనాటి రోజుల్లో దాదాపుగా 23 అడుగుల ఎత్తైన రాళ్లను ఎట్లా రవాణా చేయగలిగేవారో? ఒకదానిపై మరొకటి ఏ విధంగా పేర్చేవారో కనీసం ఊహించగలరా?

అవునండీ! ఇంగ‍్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్టోన్‌హెంజ్‌ను చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది!! వీటిని బృహత్‌  శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. అరుదైన బ్లూస్టోన్‌ మెటీరియల్‌తో రూపొందించిన అతిపెద్ద మెగాలితిక్‌ రాళ్ల వృత్తాకర సమూహమే ఈ స్టోన్‌హెంజ్‌. ఐతే ఈ భారీ శిలలు అంత ఎత్తు ఏవిధంగా పెరిగాయో? వీటి నిర్మాణ సమయంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ రాళ్లను ఎలా తీసుకురాగలిగారో? ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అద్భుతమైన కట్టడాన్ని వీక్షించడానికి ప్రతీ యేట ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా టూరిస్టులు సందర్శిస్తున్నారు. కుదిరితే.. మీరు ఓసారి వెళ్లి చూడండి.

చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top