ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్‌ ఇవే..!

Brands Behind Ileana Dcruze Beauty - Sakshi

 స్టార్‌ స్టయిల్‌

ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా!  ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం.. 

గోపి వేద్‌
చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్‌’ లేబుల్‌.  ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్‌. ఇంకో ఫ్రెండ్‌ అర్నాజ్‌ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్‌ ‘లా’ చదివి.. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కూడా చేసింది. అర్నాజ్‌ ఈఎన్‌టీ (డాక్టర్‌) గోల్డ్‌ మెడలిస్ట్‌. చదువు ఈ చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్‌ డిజైనింగ్‌ పట్ల ఉన్న కామన్‌ ఇంటరెస్ట్‌ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్‌’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్‌ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. 

గోపి వాళ్లమ్మ డ్రెస్‌ డిజైనర్‌. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్‌ షాప్‌ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్‌ డిజైనింగ్‌ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్‌. గోపి వేద్‌ డ్రెస్‌ డిజైన్, కలర్స్‌ చూస్తే.. అర్నాజ్‌.. ఫ్యాబ్రిక్‌ అండ్‌ బిజినెస్‌ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్‌’ అనే కళాత్మాకమైన లేబుల్‌ ఆవిష్కృతమైంది. బ్రైడల్‌ కలెక్షన్స్‌ వీరి బ్రాండ్‌ వాల్యూ. 

పూజా డైమండ్స్‌
1989లో మొదలైంది ఈ బ్రాండ్‌ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్‌ మెహతా, పప్పు భాయ్‌. అహ్మదాబాద్‌ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్‌ హోల్‌సేల్‌ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్‌ ఫస్ట్‌ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్‌ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్‌ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. 

నా ఫిట్‌నెస్‌ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా 

జ్యూయెలరీ:
డైమండ్‌ ఇయర్‌ రింగ్స్‌
బ్రాండ్‌: పూజా డైమండ్స్‌
ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి 
ఉంటుంది. 

డ్రెస్‌ 
షరారా సెట్‌
బ్రాండ్‌: గోపి వేద్‌ 
ధర: 28,500

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top