సాల్మన్‌ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్‌ బి6 వల్ల జుట్టుకు.. | Best Foods For Healthy Hair Growth According To Doctors - Sakshi
Sakshi News home page

సాల్మన్‌ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్‌ బి6 వల్ల జుట్టుకు..

Published Mon, Nov 6 2023 3:54 PM

Best Foods For Healthy Hair Growth According To Doctors - Sakshi

అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్‌ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్‌, పొల్యూషన్‌ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్‌లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం.

ఆకుకూరలు

జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్‌లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాల‌కూర‌లో ఉండే పోష‌కాలు జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డ‌తాయి. పాల‌కూర జుట్టుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన కండిష‌నింగ్‌ను అందిస్తుంది. పాల‌కూర‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

నట్స్‌

ఆహారంలో ప్రతిరోజూ నట్స్‌ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాప‌ప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్‌ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి.  ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది.

గుడ్లు

కోడిగుడ్లలో ప్రొటీన్‌, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్‌ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 త‌దిత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, విట‌మిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్‌, బయోటిన్‌ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. 

చేపలు

సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్‌ హెయిర్‌ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి.  వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి.

చిలగడదుంప

జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్‌ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. 

బెర్రీలు

బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్‌లో చేర్చుకోండి.

పెరుగు

పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్‌ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్‌లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్‌ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.

Advertisement
 
Advertisement