నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్‌! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!

Benton Snail And Bee Venom Used In Korean Beauty Products - Sakshi

కొరియన్‌ అమ్మాయిలు ఎంత తెల్లగా ఉంటారో తెలిసిందే. వారి ముఖం చక్కగా కాంతివంతంగా ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదు. గ్లాస్‌ మాదిరిగా ముఖం మెరిసిపోతుంది. చిన్న మచ్చ కూడా ఉండదు. అలాంటి అందం సొంతం చేసుకోవాలంటే కొరియన్‌ బ్యూటి ప్రోక్ట్స్‌లో వాడే వాటి గురించి తెలసుకోవాల్సిందే. కొరియన్‌ పురుషులు, స్త్రీలు గ్లామర్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటారు. వాళ్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులో వాడే వాటిని చూస్తే షాకవ్వతాం. ఎందుకంటే వాళ్లు చాలా విభన్నమైన వాటితో ఫేస్‌క్రీంలు తయారు చేస్తారు. బహుశా అందుకే కాబోలు వారు అంత అందంగా ఉంటారు. కొరియన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం ఉపయోగిస్తారో చూస్తే షాకవ్వుతారు.

నతల విసర్జకాలు లేదా నత్తల జిగురు
నత్తల విసర్జకాల్లో అల్లాంటోయిన్, కొల్లాజెన్, ఎలాస్టిన్, గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీలు, యాంటీబయాటిక్ పెప్టైడ్స్‌ తదితరాలు ఉంటాయి. నత్త విసర్జకాలు లేదా నత్త జిగురు వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేటడ్‌గా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ మొటిమల వల్ల అయ్యే గాయాలను నయం చేయడమే గాక మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో జింక్‌ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా చేస్తుంది. నత్త విసర్జకాలతో తయారు చేసిన కొరియన్‌ ప్రొడక్ట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉందట. వీటిని వాడితే కచ్చితంగా కొరియన్‌ అమ్మాయిల్లా తెల్లగా ఉంటారని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

తేనెటీగల జిగురు
తేనెటీగల నుంచి లభించే ఈ రెసిన్‌ని ఆంగ్లంలో ప్రొపోలిస్ అంటారు. పుప్పొడి అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం. ఇది ముడుతలను తగ్గించే లక్షణాలతో పాటు మొటిమల బారిన పడే చర్మం, బ్రేక్‌అవుట్‌లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, పుప్పొడి చర్మానికి కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. పుప్పొడి చర్మంపై సున్నితమైన మెరుపును వదులుతుంది. ఇది క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తుందని కొరియన్లు గట్టిగా విశ్వసిస్తారట.

రంధ్రాలను తగ్గించేందుకు "ముత్యం"..
కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ముత్యాలు చాలా కాలంగా ముఖ్యమైన పదార్ధంగా ఉన్నాయి.ముత్యాలు మొటిమలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెబుతారు. అలాగే ముఖంపై విస్తరించిన రంధ్రాలను తగ్గిస్తాయని, చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు.

తేనెటీగ విషం
తేనెటీగ విషం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. తేనెటీగలు బెదిరినప్పుడు వాటిని స్రవిస్తాయి. అనేక చర్మ సంరక్షణ సంస్థలు సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి ఉత్పత్తులకు తేనెటీగ విషాన్ని వాడతాయి.ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను అందిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది.అదే విధంగా వెదురు, యుసా (ఒక రకమైన పండు), సెంటెల్లా ఆసియాటికా, బిర్చ్ సాప్ వంటి అనేక పదార్థాలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

(చదవండి: పడుకునే ముందు  ముఖం కడుగుతున్నారా?     )

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top