breaking news
Bee venom
-
నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్!
కొరియన్ అమ్మాయిలు ఎంత తెల్లగా ఉంటారో తెలిసిందే. వారి ముఖం చక్కగా కాంతివంతంగా ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదు. గ్లాస్ మాదిరిగా ముఖం మెరిసిపోతుంది. చిన్న మచ్చ కూడా ఉండదు. అలాంటి అందం సొంతం చేసుకోవాలంటే కొరియన్ బ్యూటి ప్రోక్ట్స్లో వాడే వాటి గురించి తెలసుకోవాల్సిందే. కొరియన్ పురుషులు, స్త్రీలు గ్లామర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులో వాడే వాటిని చూస్తే షాకవ్వతాం. ఎందుకంటే వాళ్లు చాలా విభన్నమైన వాటితో ఫేస్క్రీంలు తయారు చేస్తారు. బహుశా అందుకే కాబోలు వారు అంత అందంగా ఉంటారు. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం ఉపయోగిస్తారో చూస్తే షాకవ్వుతారు. నతల విసర్జకాలు లేదా నత్తల జిగురు నత్తల విసర్జకాల్లో అల్లాంటోయిన్, కొల్లాజెన్, ఎలాస్టిన్, గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సీలు, యాంటీబయాటిక్ పెప్టైడ్స్ తదితరాలు ఉంటాయి. నత్త విసర్జకాలు లేదా నత్త జిగురు వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేటడ్గా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ మొటిమల వల్ల అయ్యే గాయాలను నయం చేయడమే గాక మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో జింక్ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా చేస్తుంది. నత్త విసర్జకాలతో తయారు చేసిన కొరియన్ ప్రొడక్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉందట. వీటిని వాడితే కచ్చితంగా కొరియన్ అమ్మాయిల్లా తెల్లగా ఉంటారని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. తేనెటీగల జిగురు తేనెటీగల నుంచి లభించే ఈ రెసిన్ని ఆంగ్లంలో ప్రొపోలిస్ అంటారు. పుప్పొడి అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం. ఇది ముడుతలను తగ్గించే లక్షణాలతో పాటు మొటిమల బారిన పడే చర్మం, బ్రేక్అవుట్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, పుప్పొడి చర్మానికి కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. పుప్పొడి చర్మంపై సున్నితమైన మెరుపును వదులుతుంది. ఇది క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తుందని కొరియన్లు గట్టిగా విశ్వసిస్తారట. రంధ్రాలను తగ్గించేందుకు "ముత్యం".. కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ముత్యాలు చాలా కాలంగా ముఖ్యమైన పదార్ధంగా ఉన్నాయి.ముత్యాలు మొటిమలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెబుతారు. అలాగే ముఖంపై విస్తరించిన రంధ్రాలను తగ్గిస్తాయని, చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు. తేనెటీగ విషం తేనెటీగ విషం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. తేనెటీగలు బెదిరినప్పుడు వాటిని స్రవిస్తాయి. అనేక చర్మ సంరక్షణ సంస్థలు సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి ఉత్పత్తులకు తేనెటీగ విషాన్ని వాడతాయి.ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను అందిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది.అదే విధంగా వెదురు, యుసా (ఒక రకమైన పండు), సెంటెల్లా ఆసియాటికా, బిర్చ్ సాప్ వంటి అనేక పదార్థాలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
ఆ ట్రీట్మెంట్ ఆమె పాలిట శాపమైంది..
స్పెయిన్ : ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఆమె పాలిట శాపంగా మారింది. మృత్యువు తేనెటీగ రూపంలో కాటువేసి ప్రాణాలు తీసింది. తేనెటీగలు కుట్టించడం ద్వారా నొప్పుల నుంచి ఉపసమనం పొందడానికి చేసే’ ఎపిథెరపి’ ఆక్యుపంక్చర్ విధానం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ గత రెండేళ్లుగా కండరాళ్ల బిగుతుదనం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ థెరపీని చేయించుకుంటోంది. అయితే కొద్ది రోజుల ముందు థెరపీలో భాగంగా తేనెటీగతో కుట్టించుకోగా స్పృహ కోల్పోయింది. యాంటీ ఎపీ వెనమ్ ఇచ్చినప్పటికి ప్రయోజనం లేక పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె తేనెటీగ కుట్టడం ద్వారా వచ్చిన అలర్జీ కారణంగా కోమాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల పాటు కోమాలో ఉన్న ఆమె అనంతరం మరణించింది. వెయ్యి సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్న ఈ ప్రాచీన వైద్య విధానం ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని, నైపుణ్యం లేని వారు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. ఆక్యుపంక్చర్ విధానంలో సూదుల ద్వారా లేదా తేనెటీగలు కుట్టించడం ద్వారా ఇలా రెండు రకాలుగా చేస్తారు. తేనెటీగల విధానం ద్వారా ప్రమాదం ఉన్నప్పటికీ ప్రమోజనాల దృష్ట్యా అందరూ ఈ తరహా వైద్యం చేయించుకోవటానికే మొగ్గు చూపుతుంటారు. -
తేనెటీగ విషం... ఆ బాధకు విరుగుడు
విషాన్ని తగువిధంగా ఉపయోగిస్తే అది ఔషధం అవుతుందన్న విషయం మరోమారు రుజువైంది. ఇది పూర్తిగా నిర్ధారణ జరిగి, మనుషులకు అందుబాటులోకి వస్తే కోట్లాది ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఆర్థరైటిస్‌తో బాధపడే అనేక మందికి నిజంగా శుభవార్తే. తేనెటీగ కుట్టినప్పుడు అది వెలువరించే విషపదార్థాలు ఆర్థరైటిస్‌ను తగ్గిస్తాయని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు. ఆ విషంలోని పెప్టైడ్ వల్ల ఇది సాధ్యపడుతుందంటున్నారు వారు. ఈ పెప్టైడ్‌లో ‘మెలిటిన్’ అనే పదార్థం ఉంటుంది. అది కీళ్ల మధ్య షాక్ అబ్జార్బర్‌గా పనిచేయడంతో పాటు... ఎముక చివరన ఉండే ‘మృదులాస్థి’ శిథిలం కాకుండా కాపాడుతుందట. ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగాలు చేసి, ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు నిపుణులు. ఇంకా మానవుల్లో ఈ ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇది కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మాత్రమే గాక... ఆటల్లో, ప్రమాదాల్లో గాయపడేవారికీ మేలు చేకూరుస్తుందంటున్నారు పరిశోధకులు.