Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్‌, ఆలివ్‌ ఆయిల్‌తో ఇలా చేస్తే..

Benefits Of Using Lemon Honey On Face And Ways To Use It - Sakshi

►తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది.  ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్‌ ఆయిల్‌ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా రబ్‌ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.  ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. 

అర టీస్పూన్‌ గంధపు పొడిలో తగినంత రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తూ వుంటే ముడతలు తగ్గడంతో ΄ాటు ముఖ కాంతి మెరుగుపడుతుంది.

నల్లమచ్చల నివారణకు...

► నాలుగు తులసి ఆకులు, పావు టీస్పూన్‌ పసుపు కలిపి పేస్ట్‌ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాలు ఉంచి కడిగేయాలి.

► అరచేతిలో టీ స్పూన్‌ తేనె తీసుకుని రెండు రేకల కుంకుమ పువ్వుని వేసి రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top