Wood Roller Therapy: వుడ్‌ రోలర్‌.. స్లిమ్‌గా మార్చేస్తుంది! ముడతలు తొలగిస్తుంది! ధర ఎంతంటే!

Beauty Tips: Wood Roller Therapy Will Help Reduce Fat Get Slim - Sakshi

Beauty Tips In Telugu: ఉన్న అందాన్ని సంరక్షించుకోవడమే అసలైన సౌందర్య సాధన. వయసు పెరిగేకొద్ది.. ఒంటిమీద శ్రద్ధ తగ్గి.. శరీర ఆకృతి మారిపోతుంటుంది. బరువు పెరిగి పొట్ట, నడుము చుట్టుకొలతలు మారిపోవడం.. చర్మం పటుత్వాన్ని కోల్పోవడం.. వాటికి తోడు పని ఒత్తిడి, తీవ్ర అలసటతో మొహంలో కాంతి తగ్గడం.. ఇలా పలు కారణాలతో ఉన్న ఆకృతిని పోగొట్టుకుంటుంటారు చాలామంది. అలాంటి వారికి అసలైన థెరపీని అందిస్తుంది ఈ వుడ్‌ రోలర్‌.

మనిషిని స్లిమ్‌గా మార్చేస్తుంది. ముడతలు తొలగించి యవ్వనాన్ని తిరిగి ఇస్తుంది. ఈ టూల్‌ని వినియోగించడం చాలా సులభం. ఇది చాలా వేగంగా కండరాల నొప్పిని తగ్గించి.. టెన్షన్‌ను మాయం చేసి.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది. కొవ్వు తగ్గించి.. శరీరాన్ని ఫిట్‌గా మారుస్తుంది. 

చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు!
ఈ మల్టీఫంక్షనల్‌ రోలర్‌.. సహజమైన చెక్కతో తయారైంది. ఈ టూల్‌ని చపాతీ కర్ర పట్టుకున్నట్లుగా పట్టుకుని.. శరీరంలో ఏ భాగం తగ్గాలో, ఏ భాగంలో ఇబ్బంది ఉందో అక్కడ నొక్కుతూ అటు ఇటు జరుపుతూ ఉండాలి. అయితే ఇది చపాతీ కర్ర అంత స్టిఫ్‌గా ఉండదు. టూల్‌ మొత్తం గుండ్రటి చిన్నచిన్న చెక్క రింగ్స్‌ పేర్చినట్లుంటుంది.

నాన్‌ స్లిప్‌ అండ్‌ ఎక్స్‌టెండెడ్‌ హ్యాండిల్‌ చక్కటి గ్రిప్‌ని కలిగి ఉంటుంది. మెడ, పొట్ట, నడుము, తొడలు, కాళ్లు ఇలా వేటినైనా సులభంగా మసాజ్‌ చేసుకోవచ్చు. అయితే చేతుల లావు తగ్గాలన్నా.. ముడతలు పోవాలన్నా మరొకరి సాయం తీసుకోవాలి. ఎవరికి వారు చేతులపై ఈ వుడ్‌ థెరపీని చేసుకోవడం కష్టమే. దీని ధర సుమారు 21 డాలర్లు. అంటే 1,672 రూపాయలు. 

చదవండి: Beauty Tips: బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే..
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top