కాంతిమంతమైన ముఖం కోసం.. | Beauty Tips: How To Get Radiant And Glowing Skin | Sakshi
Sakshi News home page

కాంతిమంతమైన ముఖ్యం కోసం..! ఇవిగో సింపుల్‌ చిట్కాలు

Jun 1 2025 9:32 AM | Updated on Jun 1 2025 9:32 AM

Beauty Tips: How To Get Radiant And Glowing Skin

ముఖం కాంతిమంతంగా, ఆకర్షణీయం కనిపించడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంటే సహజసిద్ధంగా ఇంట్లో లభించేవే మంచివంటున్నారు నిపుణులు. మన ప్రతి నిత్యం చూసే వాటితో చాలా సింపుల్‌గా మన సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దామా..!.

టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ రోజ్‌వాటర్‌ను తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అంది మొటిమలు తగ్గుముఖం పట్టడంతోపాటు, చర్మం మృదువుగా తయారయి నిగారింపు సంతరించుకుంటుంది. 

బాగా మగ్గిన అరటిపండు తొక్క తీసుకుని టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. ఈప్యాక్‌ను రెండురోజులకొకసారి వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మెరుపులీనుతుంది. ట్యాన్‌ను తరిమేస్తుంది..

మూడుస్పూన్ల ముల్తాని మట్టిలో రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్, మూడు టీస్పూన్ల పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లలోకి పోకుండా ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ట్యాన్‌ క్రమంగా పోతుంది. చర్మానికి విటమిన్‌ ఏ, తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది.  

(చదవండి: పాలీవర్కింగ్‌ గురించి విన్నారా..?)

Advertisement
 
Advertisement
Advertisement