విద్యార్థుల‌కు ఉచితంగా ఫోన్లు..రీచార్జ్ కూడా

ATeacher In Tamilnadu Provides Free Smartphones To Students  - Sakshi

తమిళనాడులో గత కొన్నాళ్లుగా ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చేరే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది. స‌ర్కారు బ‌డుల‌పై ఏర్ప‌డుతున్న న‌మ్మ‌కం,  ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల భారాన్ని తట్టుకోలేని నిస్సహాయత వల్ల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పిస్తున్నారు. దీనికి తోడు క‌రోనా నేప‌థ్యంలో భోధ‌నాతీరూ మారింది. అయితే మారుమూల ప్రాంతాల్లో, అస‌లు టీవీలు, సెల్‌ఫోన్లు లేని కుటుంబాలు కూడా అనేకం. దీంతో వారికి సాయ‌ప‌డేందుకు ఓ అడుగు ముందుకేశారు లెక్క‌ల టీచ‌ర్ కె. భార్గ‌వి.  ప్రభుత్వ టీవీ చానల్‌ ‘కల్వి తొలైకచి’ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేవాళ్లు. అయితే ముఖ్యంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల గురించి ఆమె మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంది. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేరుగా విద్యార్థుల‌తో ముచ్చ‌టించి వారిని గైడ్ చేసేది. (వీధికుక్కలను బతకన్విండి... ప్లీజ్)

అయితే చాలా మంది స్టూడెంట్స్ ఆ గ్రూపులో లేరు. అస‌లు వీళ్లు పాఠాలు వింటున్నారా లేదా అని తెలుసుకోవ‌డానికి టీచ‌ర‌మ్మ 80 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి మ‌రీ విద్యార్థుల వ‌ద్ద‌కు చేరుకుంది. వారంతా పేద విద్యార్థులు. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితుల్లో ఇక స్మార్ట్‌ఫోన్లు కొనగం గ‌గ‌న‌మే. స‌మ‌స్య తెలుసుకొని ఎవ‌రో వ‌చ్చి స‌హాయం చేస్తారులే అని ఊరుకోకుండా టీచ‌ర‌మ్మే సాయం చేయ‌డానికి ముందుకొచ్చింది. త‌ను దాచుకున్న ల‌క్ష రూపాయ‌ల‌తో 16 మంది పేద విద్యార్థుల‌కు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చింది. అంతేనా వాటికి సిమ్‌కార్డులు, రీచార్జ్ బాధ్య‌త‌ల‌ను కూడా త‌నే తీసుకుంది. స్కూళ్లు తిరిగి తెరిచి, విద్యార్ధులు వ‌చ్చేవ‌ర‌కు వాటికి పూర్తి రీచార్జ్ తానే చేస్తాన‌ని హామీ ఇచ్చింది. నా పిల్ల‌లు పాఠాలు వినాలి, ప‌రీక్ష‌లు పాస‌వ్వాలి. అందుకే నావంతు చిన్న ప్ర‌య‌త్నం అంటూ వెల్ల‌డించింది. టీచ‌రమ్మ మంచి మ‌న‌స్సుకు మ‌నమూ చెబుతామా హ్యాట్సాఫ్.. (సూపర్‌ మష్రూమ్స్‌.. అద్భుతః!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top