ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం.. | Adithya recounted her love story with Aswin lost one leg | Sakshi
Sakshi News home page

ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం..

Mar 23 2026 12:46 PM | Updated on Mar 23 2026 4:36 PM

Adithya recounted her love story with Aswin lost one leg

ఎంతటి ప్రేమలో అయినా..చిన్న చిన్న మనస్పర్థలు సహజం. కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా అదే ప్రేమ కొనసాగితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు. ఆ బంధం ఎన్నటికీ అత్యంత బలమైనది..స్వచ్ఛమైనది కూడా. అలాంటి గొప్ప ప్రేమనే పొందాడు ఈ యువకుడు. ఆమె ఆ రోజు అండగా నిలిచి ధైర్యం ఇచ్చి ఉండకపోతే తాను బతికి ఉండేవాడిని కాదంటున్నాడు అశ్విన్‌. వారి ప్రేమ కథ అమరం, అఖిలం అనొచ్చు. అంత అందమైన ఆ క్యూట్‌ లవ్‌ స్టోరీ ఏంటో చూద్దామా..

కేరళకు చెందిన ఆదిత్య అనే అమ్మాయి తన లవ్‌స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది. తమ ప్రేమ కథ పాఠశాల రోజుల్లో 2014లో మొదలైందంటూ చెప్పుకొచ్చింది ఇలా. "ఆమెకు 14 ఏళ్లు, అశ్విన్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు..కలిసి నవ్వుకోవడం, రోజువారి చదువు ఒత్తిళ్లు గురించి మాట్లాడుకోవడంతో స్నేహంగా మొదలైంది. క్రమంగా మా బంధం బలపడటం మొదలైంది. మొదటగా అశ్విన్‌ తన భావాలను వ్యక్తపరిచినప్పుడు..ఆదిత్య దిగ్బ్రాంతికి గురై..దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది". 

అయితే ఆ దూరంలోనే తనకు అశ్విన్‌ ఎంత ఇంపార్టెంట్‌ అనేది అర్థమైందని చెబుతోంది. దాంతో మళ్లీ తనని కలిసి తమ రిలేషన్‌ కొనసాగించినట్లు చెప్పుకొచ్చింది. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడం మొదలైంది కూడా. ఇక అశ్విన్‌ ఇంజనీరింగ్‌ చదవడానికి తమిళనాడుకి మారాడు. ఇద్దరి మధ్యం దూరం పెరిగినా..ఏదోలా కలుసుకుంటూ తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు. అలా హాయిగా సాగుతున్న తరుణంలో తమ ప్రేమను ఓ కుదపు కుదిపేసింది ఆ రోడ్డు ప్రమాదం.

అమాంతం అన్నింటిని మార్చేసిన ప్రమాదం..
మే 2017లో మద్యం సేవించిన డ్రైవర్‌ కారణంగా జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదం అశ్విన్‌ దారుణంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ అతని కాలుని కాపాడటానికి సుదీర్ఘ వైద్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు అతని ప్రాణాలు కాపాడేందుకు ఆ కాలుని తొలగించక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని ఆదిత్య, అశ్విన్‌ తల్లి ద్వారా తెలుసుకుని కుంగిపోయింది. 

మానసిక మద్దతు అవసరమైన సమయంలో ఆదిత్యకు కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి. వైకల్యంతో జీవిస్తున్న అతడితో భవిష్యత్తు గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. దూరంగా ఉండాలని సూచించారు కూడా. ఈ ఒత్తిడి ఏ  స్థాయిలో పెరిగిపోయిందంటే..ఆదిత్య తీవ్రంగా కుంగిపోయే స్థితికి చేరుకుంది. ఆమె ఆవేదన, తీవ్రమైన ప్రేమను చూసి..తల్లిదండ్రులే దిగొచ్చి అర్థం చేసుకున్నారు. 

ఇక అశ్విన్‌ సైతం ఆ ప్రమాదం తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా పోరాటం చేశాడు. తాను ఒక భారంగా మారిన జీవితంలోకి రావద్దని ఆదిత్యకు సూచించాడు అశ్విన్‌. ఈ సంబంధాన్ని ముగించమని చెప్పాడు. కానీ ఆమె అదే ప్రమాదం తనకు జరిగితే నువ్వే ఏం చేస్తావు అని అడిగి.. అశ్విన్‌ని మారుమాట్లాడకుండా చేసింది. తమ బంధాన్ని పునరుద్ధరించుకుని..తమ జీవితాలను తీర్చిదిద్దుకునే వైపుగా అడుగులు వేశారు ఇద్దరు. 

ఈలోగా అశ్విన్‌ తన ఇంజనీరింగ్‌ చదువుని పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగా, ఆదిత్య కూడా తన చదువుని పూర్తి చేసింది. ఒకరికొకరు అందించే అచంచలమైన మద్దతులో పాతుకుపోయిని వారి వ్యక్తిగత ఎదుగుదల తోపాటు వారి సంబంధం కూడా పరిణితి చెందింది. అలా 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారిద్దారు. 

అయినా అప్పటికే ఇరు కుటుంబాలు వారి ప్రేమలో బలాన్ని చూసి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాయి. ప్రస్తుతం వారిద్దరూ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏ బంధమైన నిరంతర శ్రద్ధ, గౌరవంతో బలోపేతమవుతుందని చెబుతున్నారు ఈ దంపతులు. సరదాగా స్నేహంగా మొదలై ప్రేమగా చిగురించిన ప్రేమను..చిన్న చితకా సమస్యలు, గాలి వానలా వచ్చిన కష్టాలకు తట్టుకుని పోరాడి..విజయవంతంగా పెళ్లిపీటలు ఎక్కేలా చేసుకున్నారు. 

ఈ కేరళ జంట ప్రేమ నెటిజన్లను ఆకర్షించడమే కాదు పెద్ద ఎ‍త్తున్న ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి కూడా. అయితే ఆదిత్య ఇది త్యాగం వల్ల నిలిచిన ప్రేమ కాదు..అవగాహన, నిబద్ధతపై నిలిచిన శాశ్వతమైన ప్రేమ అని  బలంగా చెప్పడం విశేషం.

 

(చదవండి: భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి రేంజ్‌కు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement