తొమ్మిదేళ్ల చిన్నారి తలలోకి కత్తెర దిగడంతో..

9 Year Old Filipino Girl Got Scissors Stuck In Her Head - Sakshi

ఇంట్లో చిన్నారులు ఉంటే చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి వారిని. ఎప్పటికప్పుడూ వేయికళ్లతో పర్యవేక్షించాలి. ఏమరుపాటున పదునైన వస్తువులో లేదా ప్రమాదకరమైన పరికరాలో సమీపంలో ఉంచామో ఇక అంతే. ఇక్కడ కూడా ఓ చిన్నారి విషయంలో అలానే జరిగింది. ఆ చిన్నారి తల్లిందండ్రలు కడు పేదవాళ్లు. దీంతో వారి బాధ అంత ఇంత కాదు. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైందంటే..

ఈ షాకింగ్‌ ఘటన ఫిలప్పీన్స్‌లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల పాఠశాల విద్యార్థిని నికోల్‌ తలలో కత్తెర దిగింది. దీంతో ఆ చిన్నారి బాధ అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..ఆ చిన్నారి తన సోదరుడితో పెన్సిల్‌ విషయమై గొడవపడింది. దీంతో ఆ బాలుడు కోపంతో కత్తెర తీసుకుని ఆ చిన్నారి తల వెనుక దాడి చేశాడు. అది అనుకోకుండా తలలోకి బలంగా దిగింది. ఈ అనూహ్య ఘటనతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

ఐతే ఆ చిన్నారికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. కడు పేదవాళ్లైనా ఆ తల్లిదండ్రుల ఆ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు తట్టుకునే శక్తి లేక విలవిల్లాడింది. దీంతో ఆ చిన్నారి ఆ కత్తెరతోనే వారం పాటు ఆస్పత్రిలో గడపాల్సి వచ్చింది. ఐతే స్థానికులు అతడి పరిస్థితి చూసి.. సాయం చేసేందుకు ముందకు రావడంతో ఆ చిన్నారికి జులై 9న విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ చిన్నారి తండ్రి తమ కూతురు శస్త్ర చికిత్సకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి త్వరితగతిన కోలుకుంటుందని, ఆమె మెదడుకు ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. అంతేగాదు ఆ చిన్నారి తండ్రి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వారి సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు.

(చదవండి: పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top