● పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
● మురసు తుపానులోనూ ముమ్మర ప్రచారం
కై కలూరు: హామీల అమలుకు కేరాఫ్ అడ్రస్‌గా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఇప్పటికీ చెరిగిపోలేదని, ఓట్లు రూపంలో అభ్యర్థుల విజయానికి కారణమవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆశాభావం వ్యక్తం చేశారు. మురసు తుపానుతో జోరు వర్షం, అందునా జెట్పీటీసీ, ఎంపీటసీల ప్రచారపర్వానికి చివరి రోజు కావడంతో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి ఆచవరం, శ్యామలాంబపురం, తామరకొల్లు, వరహాపట్నం, గోపవరం, గోనెపాడు, ఆటపాక, కై కలూరులో అభ్యర్థులతో కలసి ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పప్పుబెల్లంలా బటన్ నొక్కుతున్నారని కూటమి నేతలు హేళన చేశారన్నారు. ఆయన పేదల సంక్షేమానికి ఎంత కృషి చేశారో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోందన్నారు. నేడు సామాన్య, మద్యతరగతి ప్రజలు నిత్యవసర సరుకుల ధరలను చూసి గుండెలు బాదుకుంటున్నారన్నారు. తిరిగి వైఎస్సార్‌సీపీ పాలన కావాలని కోరుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెట్పీటీసీ అభ్యర్థి జయమంగళ కాసులు మాట్లాడుతూ సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. అనేక గ్రామాల్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. పలు చోట్లు మహిళలు డీఎన్నార్‌కు హారతలు పట్టారు. యువత సైతం ఏ మాత్రం వెనకంజ వేయకుండా జోరున వర్షంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు గొల్లేరు పార్వతీ, మీగడ వెంకట సత్యనారాయణ, గంగుల ఆంజనేయులు, భట్రాజు రాజేష్, పడాల వెంకటరెడ్డి, సింగంశెట్టి రాంబాబు(రాము), పాలపర్తి సంధ్యారాణి, బోడిచర్ల దిలీప్‌కుమార్, బిరుదుగడ్డ లాజరు, మారగాని తేజస్వీ శ్యామలా, ఖైరున్నీసాభేగం, పెద్దింటి అరుణ, సుంకర లత, నాయకులు అల్లూరి మంగారావు, చవలి రజనీకాంత్, బండి ప్రసాద్, పంజా రామారావు, ఈదా మురళీ, కన్నా రమేష్, సన్నిది కృష్ణ, ఈదా లక్ష్మణ్, బుర్ల నాగరాజు, మాడపాటి చింతయ్య, బోడావుల వెంకటస్వామి, చేవేటి ఏసుబాబు, సమయం అంజి, గాలిబ్‌బాబు, బుర్ల పోతురాజు, బోడావుల వడ్డికాసులు, చొప్పర్ల రాము, బుర్ల కిరణ్, ఉలిసి శ్రీను, పెద్దిరాజు, సుంకర శివ తదితరులు పాల్గొన్నారు.


