ఉంగుటూరు,: మండలంలోని గోపీనాథపట్నం గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడు చేకూరి శ్రీనివాసరాజు (నాగబాబు) ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, స్థానిక పారిశ్రామికవేత్త ఏగేసిన గోవిందరాజు సమక్షంలో వీరందరూ పార్టీ కండువాలు కప్పుకుని వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. జొన్నాడ ఆంజనేయులు, పెండ్రాల యేసు, గంట ఆంజనేయులు, నేరెళ్ల సురేంద్ర, పెండ్రాల శాంతరాజు, పెండ్రాల ప్రసన్నకుమార్, బొబ్బిలి లక్ష్మయ్య, పుచ్చకాయల సురేషు, గంటా శ్రీనివాసు, గంట కంచిరాజు, గ్రంధి శ్రీనివాసరావు, జొన్నాడ యేసు, పెండ్ర వెంకన్న, హాలుగంటి కిషోర్, ఏడుకొండలు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలోకి చేరిన యువతను సుబ్బరాజు సాదరంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచి పుచ్చకాయల విష్ణుమూర్తి, బేరా పెద్దిరాజు తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


