ప్రచారంలో దూకుడు
● ఏలూరులో జోరుగా ఎన్నికల ప్రచారం
● ఇంటింటా ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు
● కూటమిలో విభేదాలు కలిసొచ్చే అంశం
ఏలూరు టౌన్ : ఏలూరు నగరపాలక సంస్థ ఎన్ని కలు సమీపిస్తోన్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. కూటమిలో కుంపట్లతో మేయర్ కుర్చీ ఎవరికి దక్కేది క్లారిటీ లేక నేతల గుండెల్లో గుబులు.. కూటమి ధర్మాన్ని టీడీపీ పాటిస్తుందా? దొంగ దెబ్బ తప్పదా అనే సందేహాలు మేయర్ అభ్యర్థి వర్గాలను కలవరపెడుతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్) ప్రజల్లో తిరుగుతూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. మొత్తానికి కూటమిలో ఏలూరు కార్పొ(ప)రేషాన్ తప్పటం లేదు. జనసేన పట్టుబట్టి మరీ ఏలూరు మేయర్ సీ టును సాధించుకుని, తమ పట్టు నిలుపుకోగా.. రెండు, మూడు రోజులు తొడలు కొట్టిన టీడీపీ నేతలు అధిష్టానం హెచ్చరికలతో సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఏకంగా జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి కూటమి నేతలతో మంతనాలు జరిపి అసంతృప్తి నేతలను బుజ్జగించారు. దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకున్న కొందరు నేతలకు మేయర్ పీఠం కలలు కల్లలయ్యాయనే అసంతృప్తి తీవ్రస్థాయిలో అలాగే ఉందంటున్నారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కూటమి నేతలు సహకరిస్తారా? జనసేనను దెబ్బకొడతారా ? అనే అంశంపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది.
నగర మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోవటం ఖాయమంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) నాయకత్వంలో జోరుగా నగరంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నా గేశ్వరరావు (డీఎన్నార్) సైతం నగరంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలనీ, నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటూ హామీ ఇస్తున్నారు. కూ టమిలో కుమ్ములాటల నేపథ్యంలో మేయర్ సీ టు గెలుపు సాధ్యమేనని అంటున్నారు. నగరవాసులు సైతం మేయర్ అభ్యర్థి జీఎంఆర్ విజయంపై ఒక అంచనాకు వచ్చారని చెబుతున్నా రు. 62 కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకు నేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఉత్సాహంగా పనిచేయటం శుభపరిణామంగా ఉంది.


