కమనీయం.. కడు రమణీయం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కడు రమణీయం

Oct 26 2026 7:48 AM | Updated on Oct 26 2026 7:48 AM

ద్వారకాతిరుమల: సుస్వరాల మంగళవాయిద్యాలు.. పండువెన్నెల వెలుగులు.. వేదమంత్రోచ్ఛరణలు.. గోవింద నామస్మరణలు.. భక్తజనుల జయజయధ్వానాల నడుమ ద్వారకాతిరుమల చినవెంకన్న తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భా గంగా ఆదివారం రాత్రి ఈ వేడుక కనువిందు చేసింది. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద అనివెట్టి మండపంలోని ప్రత్యేక వేదికలో రజిత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఆశీనులను చేసి అర్చకులు కల్యాణ తంతు ప్రారంభించారు. శుభముహూర్తాన జీలకర్ర, బెల్లం ఘట్టం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను జరిపించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావు పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారు అమ్మవార్లతో కలిసి వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

నేడు రథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7.30 గంటలకు శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రత్యేక అలంకారం పాండురంగడు.

అనివెట్టి మండపంలో చినవెంకన్న కల్యాణోత్సవాన్ని జరిపిస్తున్న పండితులు

వేడుకలో పాల్గొన్న ఆలయ చైర్మన్‌, ఈఓ, భక్తులు

ద్వారకాతిరుమలలో తిరుకల్యాణ మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement