పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ ఏలూరు నగరం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్), నగరంలోని 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాత్రమే ఏలూరు నగరం అభివృద్ధి దిశగా అడుగులు వేసిందని గుర్తుచేశారు. ఏలూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది దివంగత వైఎస్సార్ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో గత వేసవిలో నగర ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది టీడీపీ వైఫల్యం కాదా ? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు లేని పారదర్శక పాలన కోసం వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని డీఎన్నార్ కోరారు.


