అక్రమ మద్యం విక్రేతల బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం విక్రేతల బైండోవర్‌

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

అక్రమ మద్యం విక్రేతల బైండోవర్‌ ఆర్టీసీ కార్గోలో క్యూఆర్‌ కోడ్‌ విధానం ప్రారంభం వైభవంగా సువర్చలా హనుమద్‌ కల్యాణం సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా ఎంపికలు వాయిదా ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ జిల్లా జట్ల ఎంపికలు

కాళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం సరఫరా, నాటుసారా విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఆకివీడు ప్రొహిబిషన్‌ – ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.వాసువేణి తెలిపారు. మండలంలో అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారిని కాళ్ల తహసీల్దార్‌ జి.సుందర్‌ సింగ్‌ ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. రూ.1.50 లక్షల సొంత పూచీకత్తుపై వారిని బైండోవర్‌ చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తణుకు అర్బన్‌: ఏపీఎస్‌ఆర్టీసీ తణుకు కార్గో (పార్సిల్‌) విభాగంలో వినియోగదారుల సౌకర్యార్థం నూతనంగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డిపో మేనేజర్‌ ఏడీఎల్‌ సుధారాణి తెలిపారు. తణుకు బస్టాండ్‌లోని కార్గో సెంటర్‌లో శుక్రవారం ఆమె క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ వినియోగదారులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వివరాలు నమోదు చేస్తే శ్రీఫ్రీ బుకింగ్‌ నంబర్‌శ్రీ వస్తుందన్నారు. ఆ నంబరును ఆపరేటర్‌కు తెలిపితే డేటా నేరుగా సిస్టమ్‌లోకి వచ్చి బుకింగ్‌ సమయం ఆదా అవుతుందని వివరించారు. వినియోగదారుల సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో బుకింగ్‌ కౌంటర్‌ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. సందేహాలుంటే కార్గో డీఎమ్‌ఈ 98491 69396 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ సువర్చలా హనుమద్‌ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్రను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ ఘట్టాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.వి.చందన తెలిపారు. భక్తుల హనుమన్నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట ) : త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీల జిల్లా స్థాయి ఎంపికలను వాయిదా వేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాప్‌ ఆదేశాల మేరకు ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించాల్సిన ఎంపికలను స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు వివరించారు. శుక్రవారం రోజున నిర్వహించిన ఫుట్‌బాల్‌ ఎంపికలతో పాటు, మిగిలిన క్రీడల ఎంపిక తేదీలను నవంబరు 10వ తేదీ లోపు ప్రకటిస్తామని తెలిపారు. తదుపరి నిర్వహించే జిల్లా స్థాయి ఎంపికల్లో ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు కూడా మరొక అవకాశం ఉంటుందని, ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

పెదవేగి: స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకులంలో శుక్రవారం అండర్‌–19 బాలబాలికల అథ్లెటిక్స్‌ జిల్లా జట్ల ఎంపికలు ప్రారంభమైనట్లు ఏలూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. జయరాజు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మందికి పైగా బాలబాలికలు ఈ ఎంపికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement