వినూత్న ఆలోచనలకు ఉద్యానరంగం వేదిక | - | Sakshi
Sakshi News home page

వినూత్న ఆలోచనలకు ఉద్యానరంగం వేదిక

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

తాడేపల్లిగూడెం: వినూత్న ఆలోచనలకు ఉద్యానరంగం వేదికగా మారిందని ఇండస్ట్రీయల్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మలత అన్నారు. స్థానిక ఉద్యాన కళాశాలలోని హార్టీబిజినెస్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో రాజమహేంద్రవరం రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 1.0లో భాగంగా నిర్వహించిన హార్టీ ఇన్నోవేటివ్‌ ఐడియా హ్యాకథాన్‌ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మలత మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారి ఆలోచనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మలిచేందుకు హ్యాకథాన్‌లు ఎంతో దోహదపడతాయన్నారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.బి.వి. చలపతిరావు మాట్లాడుతూ త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయల్లో కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతలు, శీతలీకరణ, సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు అవసరమని, ఇవి రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తాయని చెప్పారు. హ్యాకథాన్‌లో విద్యార్థులు పంటల ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వనరుల సమర్థ వినియోగంపై రూపొందించిన స్టార్టప్‌ ప్రతిపాదనలు, సాంకేతిక పరిష్కారాలను నిపుణుల ముందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్‌ సీఈఓ షేక్‌ యాసీన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement