రైతుల సమక్షంలో రీ సర్వే చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమక్షంలో రీ సర్వే చేయాలి

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

మరో ఐదుగురి అరెస్ట్‌ రైతుల సమక్షంలో రీ సర్వే చేయాలి

మరో ఐదుగురి అరెస్ట్‌
మత్తు కోసం ఉపయోగించే ట్రామడాల్‌ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్న కేసులో మరో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 8లో u

పెదపాడు: రీ–సర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే పూర్తి చేసి ఈ–కేవైసీ నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని తాళ్లమూడి గ్రామంలో జరుగుతున్న రీ–సర్వేను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే సాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కూర్మనాథ్‌ మాట్లాడుతూ సర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకత కోసం క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 బృందాల ద్వారా అత్యాధునిక రోవర్లతో సర్వే కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా రైతులు సంతృప్తి చెందేలా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ సర్వే ఇన్‌స్పెక్టర్‌ కేఎస్‌ మూర్తి, రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ కె.దుర్గారావు, మండల సర్వేయర్‌ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement