అప్పులు తీర్చలేక.. వేదన భరించలేక.. | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక.. వేదన భరించలేక..

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

తణుకు అర్బన్‌ : యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూ కిన ఉదంతం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్య లు, ఒత్తిళ్లు, బెదిరింపులు వీరి ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. అమ్మా.. నాన్న.. అంటూ విలపిస్తున్న పసిపిల్లలు, కుమారుడు, కోడ లును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో వే ల్పూరులో విషాదఛాయలు అలముకున్నాయి. వే ల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధన సాయికృష్ణ అలియాస్‌ డీవీడీ (32), భార్య శిరీష (28)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. గురువారం రాత్రి వీరిద్దరూ గోదావరి దూకి ఆత్మహత్యకు యత్నించారు. వేల్పూరులో నివసిస్తున్న సాయికృష్ణ కొన్ని నెలల నుంచి భీమవరంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. వివాహానికి ముందు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశంలో కొంతకాలం పనిచేశాడు. స్వదేశానికి వచ్చిన తర్వా త శిరీషను వివాహం చేసుకుని కొన్నాళ్లు హైదరాబాద్‌లో అంబులెన్స్‌ డ్రైవర్‌గానూ జీవనం సాగించాడు. అనంతరం వేల్పూరులో రెడీమేడ్‌ వస్త్ర దుకాణం నిర్వహించినా వ్యాపారం లేక అప్పులపాలై దుకాణం మూతపడింది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, దుర్గ వారి ఇంటిని సైతం విక్రయించి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తుండగా కొంతమేర రుణాల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ దంపతులకు కుమారుడు, కుమార్తె (కవలలు) ఉన్నారు.

అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ కుటుంబంలో ఆశల దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. ‘అమ్మా.. నాన్న.. ఎప్పుడొస్తారు?’ అంటూ ఆ పసికవలలు అడుగుతున్న ప్రశ్నలకు ఆ ఇల్లంతా మూగబోయింది. రూ.50 వేల విలువైన ఉంగరం కోసం సాగిన వేధింపులు, బెదిరింపులు చివరికి ఆ దంపతులను గోదావరి ప్రవాహంలోకి నెట్టేశాయి. రెండేళ్ల క్రితం తీసుకున్న చిన్న బాకీ, మానసిక ఒత్తిడి ఆ దంపతుల ప్రాణాలను బలిగొనగా, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాద ఘటన ఊరందరినీ కంటతడి పెట్టిస్తోంది.

గోదావరిలో దూకిన దంపతులు

ఆర్థిక సమస్యలతోనే దంపతుల ఆత్మహత్యాయత్నం

బెదిరింపులు, ఒత్తిళ్లే కారణమంటున్న తల్లిదండ్రులు

అనాథలుగా మారిన పసిపిల్లలు

వేల్పూరులో విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement