శ్రావణ శోభ.. అలంకరణ ప్రభ
శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేకపూజలు జరిగాయి. పలు ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారిని పసుపు కొమ్ములతో, జంగారెడ్డిగూడెంలో గంగానమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మవారికి కోటి పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి.
– పెదవేగి/జంగారెడ్డిగూడెం (చింతలపూడి)/తాడేపల్లిగూడెం (టీఓసీ)


