ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో క్షేత్రస్థాయిలో పోలింగు స్టేషన్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతి, బీఎల్‌ఓల పనితీరును అధ్యయనం చేశామని, తనకు సంతృప్తి కలిగిందని జిల్లా పరిశీలకుడు లోతేటి శివశంకర్ అన్నారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆర్‌ఓలు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతి, చేపడుతున్న చొరవపై రాష్ట్రంలో ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడు తూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 ప్రత్యేక దృష్టిపెట్టామని, క్షేత్రస్థాయిలో పరిశీలన, సంబంధిత అధికారులతో సమీక్షస మావేశాలు, క్రమం తప్పకుండా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీప్రతినిధులతో స మావేశాలు నిర్వహించామన్నారు. అసిస్టెంట్ క లెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వి నూత్న, ఆర్డీఓలు కె.లక్ష్మీప్రసన్న, ఎంవీ రమణ, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల వారీగా కార్యాచరణ
జిల్లాలో నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్ర ణాళికను సమర్థ్ధవంతంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్‌ను అమ లు చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబుకు తెలిపారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమం కింద 71,910 బంగారు కుటుంబాలను, 4,853 మార్గదర్శులను గుర్తించామన్నారు.


