ముసునూరు: ముసునూరులో ఈనెల 24న ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లపై భద్రతా అధికారులు, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గాన ముసునూరులోని గోర్మెట్ పాప్ కార్ని కా ఫ్యాక్టరీకి వస్తారన్నారు. ఈ మార్గంలో ప టిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. సభా కార్యక్రమ నిర్వహణ, కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, వారికి కల్పించే భద్రతా చర్యలు, ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌ డ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అధికారులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): జంగారెడ్డి గూడెం పరిధిలోని తాడువాయిలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ (పునరావాస) కాలనీతో పాటు జంగారెడ్డిగూడెం అర్బన్ ప్రాంతంలో చేపడుతున్న పీఎంఏవై–2.0 గృహ నిర్మాణ పనులను హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ, ఎండీ కె.హెప్సీబారాణి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు వేగవంతం చేయాలని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. హౌసింగ్ ఎస్‌ఈ టి.వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ డీహెచ్‌హెచ్ జి.సత్యనారాయణ, ఈఈ కేవీవీ ప్రసాద్, డీఈఈ జి.రామకృష్ణ, తహసీల్దార్ కె.స్లీవజోజి, హౌసింగ్ ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: యలమంచిలి మండలంలో గతేడాది ఎంపీపీ ఎన్నికల సమయంలో పెట్టిన కేసులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నాయకులకు కోర్టు సమన్లు వచ్చాయి. శనివా రం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కూటమి నాయకులే తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేశారని, అయినా తమ నాయకులు వైఎస్ జగన్‌పై నమ్మకంతో నిజాయితీగా నిలిచారన్నారు. దీనిని జీర్ణించుకోలేని కూటమి నేతలు అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కేసులకు భయపడబోమని, కూటమి అక్రమాలను నిలదీస్తూనే ఉంటామన్నారు. ఇటీవల పాలకొ ల్లు ఏరియా ఆస్పత్రి అభివృద్ధి పనుల్లో చెత్తను తీసుకువచ్చి డంప్ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించామని, దీంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆస్పత్రి ఘటనపై కూడా తమ నాయకులపై సీఐడీ కేసులు పెట్ట డం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజలు అన్నీ గ మనిస్తున్నారని కూటమి పాలనకు చరమగీతం పాడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటివరకూ పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, ఉచ్చుల స్టాలిన్, కోరాడ శ్రీను, పాలపర్తి కృపానాథ్, బండి రమేష్, రేలంగి శ్రీను, చెన్ను విజయ్, గుంటూరు పెద్దిరాజు, మద్దా చంద్రకళ, మోకా ప్రేమ్‌చంద్, కుక్కల బాలచందర్, మల్లుల కొండ, మందా హరికుమార్, పాలంకి శ్రీను, పోలుకొండ వెంకట్, శంకరావు శ్రీను, పాలపర్తి సందీప్, కొయ్యే నాగేశ్వరరావు, అడబాల రాము, గందం సత్యకీర్తిలకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయన్నారు. పార్టీ నాయకులు కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్, చెన్ను విజయ్, పాలపర్తి కృపానాథ్, కుక్కల బాలచందర్, రేలంగి శ్రీనులు శనివారం సమన్లు అందుకున్నట్టు చెప్పారు.


