నిట్‌కు కొత్త డైరెక్టర్
ఏపీ నిట్‌కు నాలుగేళ్ల తర్వాత కొత్త డైరెక్టర్‌గా ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణారావు రానున్నారు. అక్టోబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 8లో u
ముసునూరు: స్వచ్ఛత ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత, పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కాట్రేనిపాడు జెడ్పీ హైస్కూల్‌లో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని ఆలోచనతో ముందడుగు వేయాలని అన్నారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా, తడి, పొడి చెత్తను వేర్వేరుగా క్లాప్ మిత్రాలకు అందజేయాలన్నారు. గుంటల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత నిచ్చి, ప్రతిఒక్కరూ రెండు మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల వినియోగాన్ని మానాలన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ ప్రశాంతి, ఎంపీడీఓ ఏసుబాబు, మండల అటవీ శాఖ అధికారి త్రివేణి, హెచ్‌ఎం కుసుకుమారి పాల్గొన్నారు.
నూజివీడు: స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగులకు అప్లికేషన్ డెవలపర్ వెబ్, మొబైల్ రిపేరింగ్‌లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు కళాశాల ప్రధాన అధికారి పి.రజిత శనివారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఆపై చదువు పూర్తిచేసి 15–35 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 25లోపు కళాశాలలో అందజేయాలని, మరిన్ని వివరాలకు సెల్ 83740 39719లో సంప్రదించాలని కోరారు.


