నూజివీడు: మండలంలోని సుంకొల్లులోని కాపుల బజారు గంగానమ్మ గుడి సమీపంలోని వాగుపై శ్లాబ్ కల్వర్ట్ను నిర్మించడంలో కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై ఉన్న శ్లాబ్ కల్వర్టు మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన భారీ వరదకు శ్లాబ్ కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.26 లక్షలు మంజూరు చేయించి శ్లాబ్ కల్వర్టు నిర్మాణానికి 2024 ఫిబ్రవరి 11న శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టరు అప్పట్లో పనులు ప్రారంభించడంలో జాప్యం చేయడంతో ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు పూర్తిచేయడానికి వీలుపడలేదు. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులను రద్దు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న శంకుస్థాపన చేసిన మంత్రి
ఇంతవరకు ప్రారంభం కాని పనులు
సుంకొల్లు వాగు మార్గంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం


