ఉమ్మడి జిల్లాలో మిగులు టీచర్లు
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో పలు నిబంధ నలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 15–20 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలను కేటా యించాలి. అలాగే యూపీల నుంచి హైస్కూల్‌గా వర్గోన్నతి చెందిన పాఠశాలల్లో గ్రేడ్–2, పీడీ పోస్టులు ఇవ్వనందున ముందుగా మిగిలిన టీచర్లను సర్దుబాటు చేయాలి.
–గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
గణపవరం మండలంలో మూడు మాత్రమే మిగులు పోస్టులు ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు అవసరం. రెండు గణితం, ఒక ఎస్జీటీ మి గులుగా ఉంటే ఇంకా 5 ఎస్జీటీలు, 3 స్కూల్ అసిస్టెంట్ లు, 3 పీడీలు, 3 గ్రేడ్–2 హెచ్‌ఎంల పోస్టులు అవసరం. ఆ పాఠశాలలో జూనియర్ టీచర్‌కు బదులుగా సీనియర్ టీచర్ విల్లింగ్ ఉంటే వారికి అవకాశం ఎంఈఓ లాగిన్‌లో కల్పించారు.
–ఏసీవీ ప్రకాష్, ఎంఈవో–1, గణపవరం
నిడమర్రు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అనుగుణంగా టీచర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. గతనెల 30 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేయనున్నారు. ఒకవైపు పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆగస్టు 31 వరకూ పాఠశాలల్లో నమోదు ఉంటుంది. అయితే జూన్ 30 రోల్ ఆధారంగా పాఠశాలల్లో మిగుల పోస్టులు లెక్కతేల్చారు. దీంతో ఏలూరు జిల్లాలో 422, పశ్చిమగోదావరి జిలాల్లో 260 టీచర్ పోస్టులు సర్‌ప్లస్ (మిగులు)గా ఉన్నత అధికారులు లెక్కగట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో టీచర్ పోస్టులు భారీగా మిగిలినట్టు అంచనా. ఈ మేరకు ఆదివారం జాబితాను అధికారులు విడుదల చేశారు. అయితే ఏ స్కూళ్లలో ఏ పోస్టులు అవసరమనే సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆ వివరాలు ఎంఈఓల లాగిన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. సర్దుబాటు విషయంలో రోజుకో నిబంధనతో జూనియర్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్క్ అడ్జస్ట్‌మెంట్ ఇలా..
● గతేడాది 121 మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు ఒక్ హెచ్‌ఎం, ఐదుగురు ఎస్జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే గతంలో మాదిరిగానే 121 మంది విద్యార్థులకు 6 పోస్టుల విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పరిగణనలోకి తీసుకోలేదు.
● స్కూల్ అసిస్టెంట్ల విషయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 10 మందికి ఒక ఎస్‌ఏ, 11–30 వరకూ ఇద్దరు, 31–140 వరకూ నలుగురు, 141–175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్‌ఏలను సర్దుబాటు చేశారు.
● ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు గ్రేడ్–2 హెచ్‌ఎంతో సహా 8 మంది ఎస్‌ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్లకు 12 మంది, 8 సెక్షన్లకు 13 మంది, 9,10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది ఎస్‌ఏలను మంజూరు చేశారు.
● ఈ విధంగా 25 సెక్షన్ల వరకే గ్రేడ్–2 హెచ్‌ఎంతోపాటు 31 పోస్టులు ఉండేలా సర్దుబాటు ప్రక్రియ జరిగినట్టు అధికారులు తెలిపారు.
నేడు సర్దుబాటు
సోమవారం మిగులు టీచర్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఏ టీచర్ సర్‌ప్లస్ అయ్యారనేది అధికారులు ప్రకటించారు. అయితే ఏ మండలాల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నయనేది స్పష్టత లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా మిగులు టీచర్లతో మండలం యూనిట్‌గా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సర్దుబాటు ఉంటుంది. ఇంకా మిగిలితే డివిజన్ స్థాయిలో, జిల్లాస్థాయిలో కౌ న్సెలింగ్ నిర్వహిస్తారు. ఎక్కువగా తాజాగా పదోన్నతి వచ్చిన వారు, డీఎస్సీ–2025లో నియామకం పొందిన వారికి స్థానచలనం తప్పదని పలువురు చెబుతున్నారు.
విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
ఉమ్మడి జిల్లాలో 682 మిగులు టీచర్ పోస్టులు
రోజురోజుకూ కొత్త నిబంధనలపై ఆందోళన
అడ్మిషన్లు పూర్తవకుండానే వర్క్ అడ్జెస్ట్‌మెంట్
అవసరమైన పోస్టుల వివరాలు ఎంఈఓల లాగిన్‌కు..
డివిజన్లు మారే పరిస్థితిపై జూనియర్స్ ఆందోళన
జిల్లా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు
ఏలూరు 247 125 50
పశ్చిమగోదావరి 174 57 29


