రాట్నాలమ్మా.. నమోనమః | - | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మా.. నమోనమః

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

రాట్నాలమ్మా.. నమోనమః ‘సర్‌’తో ఓటుకు రక్షణ డిజిటలైజేషన్‌ వేగిరపర్చాలి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన

పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదాయం లభించిందని దేవస్థాన చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈఓ నల్లూరి సతీష్‌కుమార్‌ పర్యవేక్షించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ప్రత్యేక ఓటర్ల జా బితా సవరణ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. పట్టణంలోని చిగుడీలుపేట పద్మశాలీల బజార్‌ ప్రాంతంలో ఆదివారం ఆమె పర్యటించి సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలపై ఓటర్లను ఆరా తీశా రు. డిజిటలైజేషన్‌పై బీఎల్‌ఓలను ప్రశ్నించా రు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్‌ పనులను గడువులోపు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు అధికంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ వాటికి స్టెరిలైజేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్‌ ఎ.రాంబాబు, బీఎల్‌ఓలు, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : ఓటర్ల జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమ రేషన్‌ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేసి నూరు శాతం ల క్ష్యం సాధించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని 1, 2వ వార్డుల్లో ఆదివారం ఆయన పర్యటించి ఓటర్ల ఎన్యుమరేష న్‌, డిజిటలైజేషన్‌ను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆరా తీశారు. ఎన్యుమరేషన్‌ ఫారాలను ప్రజలు పూర్తిగా నింపి వీలైనంత త్వరగా బీఎల్‌ఓలకు అందజేయాలని, తద్వారా సమ గ్ర, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కోరారు. మెంటేవారితోట ప్రాంతంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను గమించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణపై ఆరా తీశారు. తహసీల్దార్‌ రావి రాంబా బు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.రాంబాబు, బీఎల్‌ఓలు ఉన్నారు.

యలమంచిలి: చించినాడ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన చప్పిడి హేమచంద్రిక (19) తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను భీమ వరం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. చంద్రిక తన మేనమామ కట్టా శ్రీనివాస్‌తో కలిసి తాటిపాకకు అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా చించినాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో ట్రక్‌ డ్రైవర్‌ ముగ్గు గణేష్‌ మద్యం సేవించి ఆ మత్తులో వాహనాన్ని రాంగ్‌ రూట్‌లో అతివేగంగా నడపడం వలనే ప్ర మాదం జరిగిందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. దీనిపై ఎస్సై రాజ్‌కుమార్‌ స్పందిస్తూ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చట్ట విరుద్ధమని హెచ్చరించడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌పై పోలీస్‌స్టేషన్‌ నుంచి దూరంగా తరలించారు. అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు సు మారు మూడు గంటలపాటు స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్‌ చంద్రిక న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement