ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరానికి చెందిన హేలా పురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో ప్రదర్శించిన నాటికలు సమాజంలోని సమకాలీన అంశాలను, మానవీయ విలువలను ప్రతిబింబించాయి. తొలుత హర్ష క్రియేషన్స్ (విజయవాడ) బృందం భువి కోరని భ్రమణం నాటికను ప్రదర్శించారు. ముడుపల్లి మోహన్ గుప్తా (గుప్తా ఫౌండేషన్) సౌజన్యంతో ప్రదర్శితమైన నా టికకు మూలకథ ఆచార్య ఉమామహేష్ అందించా రు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరణ చేశారు. కత్తి శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వం వహించారు. అనంతరం ముద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ (చిలకలూరిపేట) బృందం మా ఇంట్లో మహాభారతం నాటికను ఆవిష్కరించింది. మహమ్మద్ ఖాజావలీ సౌజన్యంతో నిర్వహించిన నాటికకు ముద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వం వహించారు. కు టుంబ విలువలు, నేటి సమాజంలో ఎదురవుతున్న మానసిక సంఘర్షణల నేపథ్యంలో సాగిన నాటిక వినోదాత్మకంగా సాగింది. హేలాపురి కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసలేంద్రరావు, అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ్‌కుమార్, సహాయ కార్యదర్శులు వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ, కోశాధికారి మహ్మద్ ఖాజావలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుప్తా సంస్థల ప్రతినిధి కె.శ్రీనివాస్, లంకా వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


