ఏలూరు టౌన్: కిరణ్ రాయల్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసభ్యంగా, వ్యక్తిగతంగా కించపరిచేలా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారని.. తమ మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లమూడి సునీల్, ఏలూరు నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పచ్చిపులుసు సుజన్, పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగరంలోని డివిజన్ ఇన్‌చార్జ్‌లు ప్రత్తిపాటి విజయకుమార్, సురేంద్రకుమార్, వినయ్, వైష్ణవి, కోండ్రు వినోద్‌కుమార్, బూరగ జ్యోతిసాగర్, కొండ్రు కిరణ్, ఇందేటి ఏసుబాబు, లంకపల్లి దీపక్, ఉప్పెన రజనీకాంత్, కరణం జగ్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యలమంచిలి: అడవిపాలెంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ కరీముల్లా (31) మృతి చెందాడు. మేడపాడు శివారు కొంతేరు జగనన్న కాలనీకి చెందిన కరీముల్లా పాలకొలు్‌ోల్లని ఇండియన్ గ్యాస్ కంపెనీలో మేనేజర్ పని చేస్తున్నాడు. పని పూర్తయిన తరువాత తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అడవిపాలెం పంచాయతీ గాంధీనగర్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో కరీముల్లా తీవ్ర గాయాలు కావడంతో ప్రమాద స్థలంలోనే కన్నుమూశాడు. ఈ మేరకు తండ్రి మహ్మద్ మునిరుద్దీన్ పోలీసులకు పిర్యాదు చేయడంలో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్‌రాజు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఆదివారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దెందులూరు: హోటల్ సరుకులు తీసుకురావడం కోసం వెళ్తూ గాలాయగూడెంలో ఈ నెల 4న బైక్ ప్రమాదంలో దేసు కోటివెంకట శ్రీనివాస్ (22)కు తలకు గాయమైంది. వెంటనే స్థానికులు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతను మృతి చెందాడు. మృతుడు గంగన్నగూడెం హోటల్లో 8 నెలలుగా పని చేస్తున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకట్ కుమార్ తెలిపారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి భారీగా అమ్మవారిని దర్శించుకుని వేడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,206 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ నాన్– అఫిషియల్ సభ్యుడిగా కొవ్వలి వినియోగదారుల సేవా మండలి అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ఎస్.ఎన్.కట్టా నియమితులయ్యారు. ఈ మేరకు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ కే.కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో జారీ చేశారు. కట్టా నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బొబ్బిలి బంగారయ్య, కుకునూరి రామచంద్ర రావు మానవత స్వచ్ఛంద సంస్థ నాయకులు కడియాల వెంకట కృష్ణారావు, మేతర అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామారావు తదితరులు అభినందనలు తెలిపారు.


