పర్యవేక్షణ లోపం వల్లే.. | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ లోపం వల్లే..

Mar 18 2026 11:09 AM | Updated on Mar 18 2026 11:09 AM

పర్యవేక్షణ లోపం వల్లే.. లోతైన దర్యాప్తు జరపాలి

నకిలీ టికెట్ల విక్రయాలపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతోందని అంటున్నారు. ఆలయ పరువు, ప్రతిష్ఠలు రోడ్డుపైకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబధిత అధికారులే కారణమని భక్తులు ధ్వజమెత్తుతున్నారు. వాడపల్లి వెంకన్న ఆదాయం ఎక్కువగా కనబడడానికి.. చిన్నవెంకన్న ఆదాయం దోపిడీకి గురికావడమే కారణమని అంటున్నారు.

ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపితే మరికొంత మంది ఉద్యోగుల పాత్రలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. విషయం సద్దుమణగక ముందే వేగంగా విచారణ జరపాలని, ఈ అక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement