బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి యువకుడు మృతి చెందాడు. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువకుడి మృతిపై విచారణ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక స్టేషన్ వద్ద నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు కొత్తపల్లి మురళీకృష్ణ, విసంపల్లి సిద్ధు మాట్లాడుతూ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన వలసకూలీలు బుట్టాయగూడెం మండలం దొరమామిడి పొగాకు బంటా కోసం వచ్చారని చెప్పారు. ఆదివారం సాయంత్రం మురుకుపూడి నాని(22) గ్రామ సమీపంలో మృతి చెందాడని చెప్పారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావులు బుట్టాయగూడెం స్టేషన్‌కు చేరుకుని ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. ఎస్సై దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం దొరమామిడి సమీపంలో యువకుడు మృతి చెందినట్లు అందిన సమాచారంతో వెళ్లి విచారణ జరిపామని చెప్పారు. మృతిపై విచారణ చేయగా.. సంఘటన సమయంలో వెళ్ళిన లారీను సీసీ ఫుటేజ్‌లో గుర్తించామని తెలిపారు. లారీకి రక్తపు మరకలు కూడా ఉన్నాయని లారీని సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు రూరల్: ఈ నెల 8న ఏలూరులో ఏలూరు జిల్లా టెన్నిస్, బ్యాడ్మింటన్ జట్లు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. అండర్–40, అండర్–35 విభాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు చేపడతామని వెల్లడించారు. ఇందులో ప్రతిభ చాటిన వారు సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశంలో జిల్లా జట్లకు ఎంపికవుతారన్నారు. ఎంపికై న వారు ఈ నెల 22, 23 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బ్యాడ్మింటన్‌కు ఎంపికై న జట్లు ఈ నెల 14, 15 తేదీల్లో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మరిన్ని 9492701324 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.


