టీడీపీ కోసం కష్టపడ్డాను.. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాన
● టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు ఆవేదన
● వెలివర్రులో కొనగుతున్న ఆమరణ నిరాహార దీక్ష
ఉండి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేశాను.. ఇప్పుడు సర్వం కోల్పోయి నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఎమ్మెల్యే (డిప్యూటీ స్పీకర్) రఘురామకృష్ణరాజు కావాలా.. నేను కావాలా అని సీఎం చంద్రబాబు, లోకేష్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం తనకు మిగిలింది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పడగొట్టిన శిథిలాలు మాత్రమే అని, న్యాయం కోసం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. శనివారం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప త్రికా సమావేశాలు నిర్వహించారని, అయితే సస్పెండ్ చేసే హక్కు చంద్రబాబుకే ఉందన్నారు. తాను శుక్రవారం దీక్ష ప్రారంభించగా దౌర్జన్యంగా అధికారులు భీమవరంలో ఆస్పత్రికి తరలించి బంధించారని, శనివారం సాయంత్రం సెల్‌ఫోన్ లాక్కుని 108 ద్వారా ఏలూరు ప్రభుత్వాస్పత్రి గుమ్మంలో దించేసి వెళ్లిపోయారని అన్నారు. తాను ఒంటరిగా ఇంటికి చేరుకున్నానని, మళ్లీ ఇదే శిథిలాల వద్ద కూర్చుని దీక్ష మూడోరోజు కొనసాగిస్తున్నానని అన్నారు. త నకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబే స స్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తన వద్ద ఉన్న పార్టీ మెటీరియల్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తానని, కూల్చగా మిగిలిన శిథిలాలకు ఉన్న పసుపు రంగు చెరిపేస్తానని అన్నా రు. తనకు న్యాయం చేయాలని కోరారు.


