కొల్లేటికోటలో కల్యాణ శోభ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి క ల్యాణం శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు వైభవంగా నిర్వహించారు. ముందుగా గోకర్ణపురం నుంచి గోకర్ణేశ్వరస్వా మిని ఉరేగింపుగా తీసుకువచ్చారు. అశేష జనం తరలివచ్చారు. ఆదివారం జలదుర్గ పెద్దింటి అ మ్మవార్లకు శ్రీ చక్రార్చన, త్రిసూల స్నానం, ప్ర థమవరణ పూజ, అష్టాదశ కళాశార్చన, అష్టాదశ శక్తి ఆవాహన, నూతన వస్త్రాలంకరణ, ధూ పసేవ, బాలభోగం నిర్వహించారు. అమ్మవారికి వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా బుద్దరాజు సుబ్రహ్మణ్యరాజు (భుజబలపట్నం), ముదుండి వెంకట సత్యనారాయణ (చినకాపవరం) వ్యవహరించారు. భక్తులకు వా టర్ ప్యాకెట్లను కొత్తపల్లి నాగధారలక్ష్మీ తేజవర్మ (భుజబలపట్నం) అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ నటరాజ నృత్య కా లానికేతన్ (విజయవాడ) శ్రీ పెద్దింట్లమ్మ మ హిమలు నృత్య ప్రదర్శన, మట్టి కుండలపై నా ట్య విన్యాసం, హాస్యవల్లరి జానపద నృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రూ.3,60,488 ఆదాయం
పెద్దింట్లమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మా ట్లాడుతూ దేవస్థానానికి మొత్తం రూ.3,60,488 ఆదాయం వచ్చిందని చెప్పారు.


