గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే

Mar 2 2026 8:15 AM | Updated on Mar 2 2026 8:15 AM

గ్రీన

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే

రవాణా రంగం అభివృద్ధి

అడుగడుగునా నిఘా.. అరచేతిలో సమాచారం

చింతలపూడి : తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రం మారనుంది, ఆంధ్రా, తెలంగాణలో ఇప్పటివరకూ లేని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉన్న ఈ హైటెక్‌ రహదారి మే నెల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ సాగరమాల పథకంలో భాగంగా సుమారు రూ.4,457 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రా జెక్టును ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. 2022 ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జిల్లాలోని రెండు ఫేజ్‌లలో చేపట్టనున్న జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు.

ప్రయాణం సాఫీగా.. దూరం తక్కువగా..

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విశాఖకు సుమారు 676 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అందుబాటులోకి వస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా భారీగా ఆదా అవుతుంది. ఎక్కడా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, అనవసరపు మలుపులు లేకుండా సాఫీగా సాగే ప్రయాణం వాహనదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం వే–సైడ్‌ ఎమినిటీస్‌

దీర్ఘకాలిక ప్రయాణాల్లో అలసట లేకుండా ఉండేందుకు ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి రోడ్డుకు ఇరువైపులా అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. హో టళ్లు, ఫుడ్‌ కోర్టులు, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, పెట్రోల్‌ బంకులు, వాహనాల రిపేర్‌ షాపులు ఉంటాయి. విద్యుత్‌ పొదుపు కోసం రహదారి పొడవునా సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటుచేశారు.

యాక్సెస్‌ కంట్రోల్‌తో..

సాధారణ రహదారుల మాదిరిగా ఎక్కడపడితే అక్కడ ఎంట్రీలు, ఎగ్జిట్‌లు ఈ హైవేకు ఉండవు. దీనివల్ల మధ్యలో పాదచారులు లేదా స్థానిక వాహనాలు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదం ఉండదు. తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అభివృద్ధికి రహదారులు వారధులు అంటారు. ఖమ్మం–దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

రయ్‌రయ్‌ మంటూ..

తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు

అందుబాటులోకి తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 4 వరుసల రహదారి

మే నుంచి ప్రయాణం షురూ

హైదరాబాద్‌–విశాఖ మధ్య తగ్గనున్న 60 కిలోమీటర్ల దూరం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీకారం

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రారంభమయితే జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, పో లవరం నియోజకవర్గాలు ర వాణాపరంగా అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్‌, విశాఖకి ఇదే ప్రధాన రహదారి కావడంతో అటు జిల్లా కేంద్రం ఏలూరు నుంచి చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణాల మీదుగా దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా, పారి శ్రామికంగా, వ్యాపారపరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.

– కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి

హైవే ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఒక స్మార్ట్‌ హైవే. రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన బోర్డులపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసే సమీపంలోని ఆస్పత్రులు, హోటళ్లు, పోలీస్‌స్టేషన్లు, యాక్సిడెంట్‌ స్పాట్స్‌ వివరాలు వెంటనే ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి. హైవేపై సెన్సార్లు, కెమెరాలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సాయంతో ట్రాఫిక్‌ సమస్యలను సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను కెమెరాలతో గుర్తించి ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌ చలానాలు విధిస్తారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే 1
1/2

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే 2
2/2

గ్రీన్‌ఫీల్డ్‌ హాయివే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement