పీఆర్సీ జాప్యంతో టీచర్లకు అన్యాయం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయుల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక పవర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ వి ద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం, అధికారులకు పలుమార్లు ప్రాతినిధ్యాలు సమర్పించినా ఫలితం ఉండటం లేదన్నా రు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు గడిచినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటుచేయకపోవడం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు తీరని అన్యాయమన్నారు. గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉ న్నాయన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, 2004 సెప్టెంబర్ 1కు ముందు జారీ చేసిన నోటిఫికేషన్‌ల ద్వారా నియమితులైన వారిని పాత పెన్షన్ విధానంలో చేర్చాలని డి మాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అనంతరం ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు ఈ.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. మోహన్, నాయకులు గుంటూరు శ్రీనివాసరావు, ఎస్‌వీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


